గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో విషాదాలో వరుసగా చోటు చేసుకుంటున్నాయి.  ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు అనారోగ్య కారణంతో మృతి చెందారు..కవి, రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి కన్నుమూశారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సోదరుడు భరత్(52) రోడ్డు ప్రమాదంలో మరణించారు.  శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ,  ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో భరత్ దుర్మరణం చెందారు.  గతంలో ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఎన్నో ప్రమాదాలు జరిగాయి..ముఖ్యంగా సెలబ్రెటీలు ఇక్కడ ఎక్కువగా మరణిస్తున్న విషయం తెలిసిందే.  

అయితే మృతికి ఏ కారణాలు అయినా కన్నవారిని కన్నీటి పర్యంతం చేస్తున్నారు.   భరత్ శంషాబాద్ నుండి నుండి గచ్చిబౌలి వెళుతుండగా ఈ అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది.కాగా... ఈ ప్రమాదాన్ని భరత్ స్నేహితులు గోప్యంగా ఉంచారు. ప్రమాదవార్త తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి రవితేజ సోదరుడు భరత్‌గా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి గురైన కారు రవితేజ తల్లి రాజ్యలక్ష్మి పేరుతో ఉంది. ఈ ఘటన రాత్రి 10 గంటల ప్రాంతంలో చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ ప్ర‌మాదంకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించిన భరత్, తెలుగు సిసీ ప్రేక్షకులకు సుపరిచితుడు. ఒక్కడే, అతడే ఒక సైన్యం, పెదబాబు, దోచెయ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. గతంలో పలు వివాదాల్లోనూ భరత్ పేరు ప్రముఖంగా వినిపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: