manjima mohan images కోసం చిత్ర ఫలితం


సినిమాకు కథానాయిక అందాల ఆరబోత, అభినయ చక్కలిగింతలు, సొగసుల కృమ్మరింతలే వంపుసొంపులు వయ్యారాలు నయగారాలు అంగాంగ ప్రదర్శనలు విజయాని కి దగ్గర దారులు. కథ డిమాండ్ చేస్తే వెండితెరపై ఇంకెంతదూరమైనా వెళ్ళటానికి రడీ అనే ముద్దుగుమ్మలు సొగసుగత్తెలు ఉన్న చిత్ర సీమలో మంజిమా మోహన్ లాంటి మడిగట్టుకునే కథానాయకీ మణులు ఉంటారని నమ్మలేము.   

manjima mohan images కోసం చిత్ర ఫలితం


హీరోయిన్‌ అన్నాక గ్లామరస్‌గా కనిపించాలని ప్రేక్షకులు కోరుకుంటారు. వాళ్ల కోసమే తాము గ్లామరస్‌గా కనిపిస్తుంటామని కొంతమంది కథానాయికలు అంటుంటారు. లిప్‌ లాక్, బికినీ సీన్స్‌ చేసినప్పుడు కథ డిమాండ్‌ చేసిందంటుంటారు. ముద్దు గుమ్మలు ఏం చెప్పినా వినడానికి బాగుంటుంది. అయితే, మంజిమా మోహన్‌ ఇలాంటివన్నీ చెప్పనే చెప్పరు. ఎందు కంటే, ఈ బ్యూటీ లిప్‌ లాక్‌ సీన్స్‌ చేయరట.


manjima mohan images కోసం చిత్ర ఫలితం

"సాహసం శ్వాసగా సాగిపో" సినిమాలో నాగ చైతన్యతో జోడీ కట్టిన ఈ భామ ఆ తర్వాత ఏ తెలుగు చిత్రంలోనూ నటించలేదు. కాగా, "మంజిమా లిప్‌ లాక్‌ సీన్లకు, స్కిన్‌ షో చేయడానికి రెడీ" ’ అనే వార్త షికారులో ఉంది. దీని గురించి మంజిమా ఘాటుగా స్పందించారు. "ప్రేక్షకుల అభిరుచుల్లో గతానికి ఇప్పటికీ తేడా వచ్చింది. గ్లామర్‌– అశ్లీలాని కి తేడా వాళ్లకు తెలుసు. అందాల ప్రదర్శనకే ఇష్టపడని నేను లిప్‌ లాక్‌ సీన్లు చేస్తానని ఎలా చెబుతాను? అలాంటివి చేస్తేనే అవకాశాలు వస్తాయంటే సినిమాలు మానేసి ఇంట్లో కూర్చోవడానికి సిద్ధమే" అన్నారామె.

manjima mohan images కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: