పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ లో క్రేజీ ఫ్యాన్స్ ఉన్న స్టార్స్ లో పవన్ కళ్యాణ్ ఒకరు. అలాంటి పవర్ స్టార్ తో దగ్గుబాటి హీరో బాహుబలి భళ్లాలదేవ పోటీ పడుతుండటం ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. పవన్ క్రేజ్ తో పోలిస్తే రానా ఎక్కడ అనేది పక్కన పెడితే పవర్ స్టార్ కు పోటీగా రానా మార్కెట్ అంటే కాస్త ఆలోచించాల్సిందే.


అయితే ఏకంగా పవన్ సినిమా రేంజ్ కు తన సినిమా మార్కెట్ చేస్తూ సత్తా చాటుతున్నాడు రానా. అదెలా అంటే పవన్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా హింది వర్షన్ 11 కోట్లకు అమ్ముడయ్యిందని వార్తలు వస్తున్నాయి. శాటిలైట్ రైట్స్ తో కలుపుకుని పవన్ సినిమాను 11 కోట్లకు అమ్మేశారు దర్శక నిర్మాతలు.


ఇక ప్రస్తుతం రానా నటిస్తున్న నేనే రాజు నేనే మంత్రి సినిమా కూడా హింది వర్షన్ భారీ మొత్తం పలికిదని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం రానా సినిమా కూడా 11 కోట్ల దాకా రేటు పలికిందట. బాహుబలితో బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన రానా ప్రస్తుతం అక్కడ మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డాడు. అందుకే మొదట అక్కడే బాగా సినిమాలు చేశాడు. 


భళ్లాలదేవగా అదరగొట్టిన రానా నేనే రాజు నేనే మంత్రిలో కూడా టిపికల్ క్యారక్టర్ చేసినట్టు కనిపిస్తుంది. ట్రైలర్ అయితే దుమ్ము దులిపేస్తుంది. తేజ మార్క్ కి చాలా దూరంగా అనిపిస్తున్న ఈ సినిమాపై రానా గట్టి నమ్మకంతో ఉన్నాడు. పవన్ సినిమాకు సమానంగా రానా సినిమా కూడా మార్కెట్ చేయడం గొప్ప విషయమనే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: