సమంత తాను నటించే సినిమాలకు పరోక్షంగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఆ సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ విషయాలు ఆ సినిమా షూటింగ్ సాప్ట్ నుండే షేర్ చేయడం సమంతకు ఎప్పటి నుంచో అలవాటు. ఈ పద్ధతి వాళ్ళ ఆమె నటించే సినిమా దర్శక నిర్మాతల కోపానికి కూడ సమంత గతంలో టార్గెట్ కాబడింది అనే వార్తలు ఉన్నాయి. 

ఇది ఇలా ఉండగా సమంత ప్రస్తుతం నటిస్తున్న రంగస్థలం 1985 పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కోసం రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న సమంత ఈ మధ్య ఈ సినిమా షూటింగ్ నుండి ఒక  ఫోటో రిలీజ్ చేసింది. అందులో సమంత పాదాలు తప్ప ఇంకేమి కనిపించచలేదు.

ఇప్పుడు మళ్ళీ సమంత అదే షూటింగ్ స్పాట్ నుండి మరో ఫోటోను  రిలీజ్ చేసింది.  ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిలా తాను ఎలా కనిపించ బోతోంది అనే విషయం  క్లారిటీ ఇచ్చే విధంగా ఈ ఫోటో ఉంది. చుట్టూ కొండలు, మధ్యలో గోదారి ఆ గోదారి ఒడ్డున సమంత ఆకాశాన్ని చూస్తూ ఏదో ఆలోచిస్తోంది. అయితే ఈ ఫోటోలో సమంత ఫేస్‌ మాత్రం కన్పించదు.

సమంతని వెనుక నుంచి తీసిన ఫొటో ఇది.  పొడుగాటి జుట్టుతో 1980 కాలం నాటి పెళ్ళికాని అమ్మాయిలు జుట్టుకు వేసుకునే రిబ్బన్ తో సమంత తాను ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపించ బోతున్నాను అంటూ సంకేతాలు ఇస్తోంది.  మధ్య మండు వేసవి కాలంలో కొంత బ్రేక్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఈసినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టారు. ఆ ప్రయత్నాలలో భాగమే ప్రస్తుతం సమంత సోషల్ మీడియాలో లీక్ చేసిన ఈ ఫోటో. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: