rajamauli vs sridevi కోసం చిత్ర ఫలితం


రాజమౌళి ఆ మద్య పదేపదే శ్రీదేవి శివగామి పాత్రను తిరస్కరించటమే మంచిదైందని, ఒకవేళ ఆమే నటిచి ఉంటే బాహుబలి సినిమా ఆల్మోస్ట్ ఒక విఫల యత్నమై ఉండేదని చేప్పేశారు. అంతే కాదు ఆమె శివగామి గా నటించటానికి ఆమె తన ముందు పెట్టిన కోరికల చిఠ్ఠా గురించీ చెప్పారు. 


అయితే శ్రీదేవి బాహుబలి సినిమాలో తను నటించకపోవడానికి, ఆ సినిమాలో శివగామి పాత్రను తిరస్కరించడానికి జరుగు తున్న రకరకాల ప్రచారాలకు హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా ఒక ప్రముఖ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా చెక్ పెట్టింది. ప్రత్యేకించి పారితోషకాన్ని భారీగా డిమాండ్ చేయడం వల్లనే బాహుబలి యూనిట్ తనను వదులు కుందని జరుగు తున్న ప్రచారాన్ని ఆమె తప్పుపట్టింది. తను ఎనిమది కోట్ల రూపాయల పారితోషకం అడిగాను అనే ప్రచారాన్ని శ్రీదేవి ఖండించింది. హోటల్ లో కొన్ని సూట్స్, రూమ్స్ ను అడిగాను, విమానం టికెట్లను అడిగాను అనే ప్రచారాన్ని కూడా తప్పు పట్టింది అంతే కాదు ఒక ఏరియా ప్రదర్శన హక్కులను కూడా కోరినట్లు చెప్పిన మాటలను ఆమె కాదంది. 


rajamauli vs sridevi కోసం చిత్ర ఫలితం

మరి శ్రీదేవిపై ఆ ఆరోపణలు చేసింది మరెవరో కాదు. విశ్వవిఖ్యాత దిగ్గజ దర్శకుడు  ఎస్ఎస్ రాజమౌళినే కదా! బాహుబలి సినిమాను రూపొందించిన రాజమౌళినే శ్రీదేవి విషయంలో ఆ మాటలు అన్నీ మాట్లాడాడు. అందుకు సంబంధించిన యూట్యూబ్ లింకును శ్రీదేవికి షేర్ చేశారట ఎవరో! దీంతో శ్రీదేవి హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఆ అంశంపై స్పందిం చింది. అవన్నీ తప్పుడు ఆరోపణలే అని ఆమె స్పష్టం చేశారు.

rajamauli vs sridevi కోసం చిత్ర ఫలితం

ఒకవేళ తను అలాంటి డిమాండ్లు చేసే నటినే అయితే ఇప్పటి వరకు 300సినిమాలను ఎలా చేయగలిగేదాన్నేనా? అని కూడా శ్రీదేవి ఎదురు ప్రశ్నించడం విశేషం. మరి శ్రీదేవిపై ఆరోపణలు ఎవరో మీడియా వాళ్లు తెచ్చినవి కావు. రాజమౌళి చేసినవే. వాటిని శ్రీదేవి ఖండిస్తున్నారు. అంతే కాదు ఇంతవరకు శ్రీదేవిపై 300 సినిమాల్లో నటించిన అనుభవంపైగాని మరెవరూ ఇంతలా వ్యతిరేఖ ప్రచారం చేసిన దాఖలాలు లేనే లేవని నిర్ద్వందంగా లోకానికే తెలుసు. మరి ఇప్పుడు స్పందించాల్సింది రాజమౌళినే కదా!

rajamauli vs sridevi కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: