big boss show in hindi కోసం చిత్ర ఫలితం


కొన్ని కార్యక్రమాలను కొందరే పండిస్తారు. "కెబిసి" ని ఆస్థాయికి అమితాబ్ తప్ప మరొకరు రక్తిగట్టించలేక పోయారు. ఎవరు కెబిసి చేసినా అమితాబ్ తరవాతే అని రూఢీ అయింది. అదే కార్యక్రమాన్ని తెలుగులో "మీలో ఎవరు కోటీశ్వరుడు" మనస్థాయి కి తగ్గట్లు నాగార్జున విజయవంతం చేశారు. అయితే స్టార్-మా చానల్ కు ప్రమోషన్ గా చిరంజీవితో ప్రారంభించినా దానికి పెద్ద మైలేజ్ రాలేదు. నాగార్జునే బెటర్ అనే అంటున్నారంతా.  

big boss show in telugu కోసం చిత్ర ఫలితం

 
అలాగే బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అయి ఏళ్ల తరబడి ప్రసారమవుతోన్న "బిగ్‌ బాస్‌ షో" ఇప్పుడు దక్షిణాదికి దిగుమతై వచ్చింది. తమిళంలో దీనికి హోస్ట్‌గా లోకనాయకుడు కమల్‌హాసన్‌ వ్యవహరిస్తుంటే, తెలుగు షోకి జూనియర్ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా స్టార్ మా చానల్ కోసం చేస్తున్నాడు. ఇంకా తెలుగు బిగ్‌బాస్‌ ప్రసారం మొదలు కాలేదు కానీ ముందుగా కమల్‌ బిగ్‌బాస్‌ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

big boss show in hindi కోసం చిత్ర ఫలితం


సంచలనం అవుతుందని అనుకున్న ఈ షో  "తొలి రోజే డిజాస్టర్‌"  అన్న టాక్‌  తెచ్చుకుంది. ఈ కార్యక్రమాన్ని సోషల్‌ మీడియాలో దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. 'పార్టిసిపెంట్స్‌ దగ్గర్నుంచి తొలి ఎపిసోడ్‌ జరిగిన తీరు' వరకు ఏదీ జనాన్ని ఆకర్షించలేక పోయింది. బిగ్‌బాస్‌ దక్షిణాదిలో క్లిక్‌ అవుతుందా? అనేది తొలి నుంచీ పెద్ద ప్రశ్నే! అని వ్యక్తమయిన అనుమానా లకి తగ్గట్టుగానే తమిళంలో ఈ షో కి దారుణమైన చీదేసినట్లు ఫీడ్‌బ్యాక్‌ వస్తోంది. అద్భుత నటుడు కమల్ చేతిలోనే స్టార్ చానలుకు నష్ఠాలు మిగులుతున్నాయి.  

big boss show in telugu కోసం చిత్ర ఫలితం


దీంతో సహజంగానే ఎన్టీఆర్‌ షో మీద డౌట్స్‌ మొదలయ్యాయి. అయితే తమిళం లో ఎదురైన పరాభవాన్ని దృష్టిలో వుంచుకుని తెలుగు కార్యక్రమాన్ని జాగ్రత్తగా "ప్లాన్‌ చేసుకుంటే ఈ రకం నెగెటివ్‌ ఫీడ్‌-బ్యాక్‌ తప్పించుకోవచ్చు"  ముఖ్యంగా పార్టిసిపెంట్స్‌ విషయంలో రాజీ పడకుండా తప్పకుండా చూడాలనిపించే ఆసక్తికరమైన పర్సనాలిటీస్‌ ఎంచుకోవటం చాలా అవసరం. 

big boss show in telugu కోసం చిత్ర ఫలితం


అన్నట్టు తెలుగు బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్‌ చేయమని టాప్‌ యాంకర్లు ఎవరిని అడిగినా ఏదో ఒక కారణం చెప్పి తప్పించు కుంటున్నారు. కమల్ తదితరులు కొంతకాలం సినీ రంగాన్ని ఏలిన వాళ్ళు  బాగా ముదిరిపోయాక,  చిన్న తెరపై ప్రయోగాలు చేయటం మొదలెట్టారు. మరి జూనియర్ ఎన్టీఆర్‌ నటుడుగా పట్టుమని పాతిక సినిమాలు చేయ కుండానే ఈ "బిగ్‌ బాస్‌ షో" చేస్తుండటముతో అభిమానుల్లో కొంత కలవరం చెలరేగుతుంది. అంతేకాదు ఎటుబొయి ఎటొచ్చినా ఎన్టీఆర్‌ భవిష్యత్ కొంత ప్రమాదంలో పడే అవకాశాలు లేకపోలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: