జాతీయస్థాయిలో సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ ది ఇయర్ 2016 లో టాప్ 7వ స్థానాన్ని ప్రిన్స్ మహేష్ బాబు కైవసం చేసుకున్నాడు. అయితే ఇదే లిస్టుకు సంబంధించి 2015వ సంవత్సరంలో 6వ స్థానంలో నిలిచిన ప్రిన్స్ 2016కు ఒక స్థానం కిందకి దిగడం కొంత వరకు షాకింగ్ న్యూస్ అయినా గత ఏడాది  ‘బ్రహ్మోతవం’ లాంటి భారీ ఫ్లాప్ మూవీలో నటించాక కూడ మహేష్ కు ఈ ర్యాంక్ రావడం  అతని స్టామినాను సూచిస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఇక ఈలిస్టులో నెంబర్ వన్ స్థానంలో రోహిత్ ఖండేల్వాల్ ఉండగా విరాట్ కోహ్లి 2, హృతిక్ రోషన్ 3, రన్వీర్ సింగ్ 4, ఫవాద్ ఖాన్ 5, సిద్ధార్ద్ మల్హోత్రా 6 స్థానాలలో ఉన్నారు. అదే విధంగా . జితేష్ ఠాకూర్ 8, దోసంజ్ 9, షాహిద్ కపూర్ 10 స్థానాలనుదక్కిచుకున్నారు. అయితే ‘బాహుబలి2’ తో నేషనల్ సెలెబ్రెటీలుగా మారిపోయిన ప్రభాస్ కు 22 వస్తానం రాణాకు 24 వ స్థానాలు మాత్రమే లభించడం ఇక్కడి ట్విస్ట్.

దీనితో గత సంవత్సర కాలంగా మహేష్ నటించిన ఏ ఒక్క సినిమా విడుదల కాకపోయినా మహేష్ క్రేజ్ చెక్కు చెదరలేదు అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా మహేష్ ‘స్పైడర్’ ను ఈ దసరాకు ఎన్ని సినిమాల పోటీ ఉన్నా విడుదల చేసితీరాలని మహేష్ గట్టి పట్టుదల పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికి కారణం సెప్టెంబర్ 27 నుండి వరసగా వస్తున్న ఆరు రోజుల సెలవులు అని అంటున్నారు. ఇటువంటి వరస హాలిడేస్ మళ్ళీ సంక్రాంతి వరకు లేని నేపధ్యంలో ఎంతమంది హీరోల పోటీ ఉన్నా ‘స్పైడర్’ ను విడుదల చేసితీరాలి అని మహేష్ చేస్తున్న ఒత్తిడికి దర్శకుడు మురగదాస్ సతమతమవుతున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: