రాజమౌళి అడిగితే చాలు ఎంతటి టాప్ హీరో అయినా తమ డేట్స్ ఇవ్వడానికి ప్రస్తుతం రెడీగా ఉన్నారు అన్నది వాస్తవం. అయితే హీరోలనుబట్టి కథలను కాకుండా కథలనుబట్టి హీరోలను ఎంచుకునే అలవాటు రాజమౌళిది. అందువల్లనే హీరోల చుట్టూ తిరగవలసిన పని రాజమౌళికి లేడు. 

‘బాహుబలి 2’ తరువాత నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళిని అతిధిగా ఎన్నో కార్యక్రమాలకు పిలుస్తున్నారు. ఈ నేపధ్యంలో రానా ఒక ప్రముఖ ఛానల్ కోసం నిర్వహిస్తున్న ‘నెం.1 యారి’ షోకు అతిధిగా వచ్చిన రాజమౌళి రానా అడిగిన ఒక ర్యాపిడ్ ప్రశ్నా కార్యక్రమంలో కొన్ని ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. 

ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న కొంతమంది టాప్ హీరోలు సినిమాలలోకి రాకుండా వేరే వృత్తులలో నిలదోక్కుకోవలసిన పరిస్థుతులు ఏర్పడితే వారు ఏ రంగాలకు బాగా సూటుఅవుతారు అన్న ప్రశ్నకు ఆ సక్తికర సమాధానం ఇచ్చాడు జక్కన్న. ‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ సినిమాలలోకి రాకుండా ఉండి ఉంటే మంచి చెఫ్ అయి ఉండేవాడని జోస్యం చెప్పాడు.

అదేవిధంగా జూనియర్ సినిమాలలోకి రాకుండా ఉండి ఉంటే ఈసమయానికే రాజకీయాలలోకి వెళ్ళి ఉండి ఒక చక్రం తిప్పి ఉండేవాడని అభిప్రాయ పడ్డాడు. అదేవిధంగా రామ్ చరణ్ సినిమాలలోకి రాకపోతే మంచి టాప్ బిజినెస్ మ్యాన్ గా ఈపాటికే సెటిల్ అయి ఉండేవాడని రాజమౌళి అభిప్రాయం. ఇలా చాలామంది హీరోలు సినిమాలలోకి రాకుండా ఉండి ఉంటే ఏయే వృత్తులలో సెటిల్ అయి ఉండేవారో రాజమౌళి ఊహాజనితంగా చెపుతూ ఉంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రానా తెగ ఎంజాయ్ చేసాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: