మెగా హీరోల్లో చిరు, పవన్ లను పక్కన పెడితే స్టార్ హీరోలుగా చరణ్, అల్లు అర్జున్ల ఫైట్ అందరికి తెలిసిందే. చిరు తనయుడిగా రాం చరణ్ తన రేంజ్ హిట్లు కొడుతుంటే అల్లు అరవింద్ కొడుకుగా బన్ని సూపర్ సక్సెస్ అయ్యాడు. ఒకానొక సందర్భంలో బన్ని చెర్రిని కూడా క్రాస్ చేశాడు అన్న టాక్ వచ్చింది.


ప్రస్తుతం స్టార్ క్రేజ్ దక్కించుకోవడమే కాదు ఆ ఇమేజ్ తో అటు ఇటుగా ఉన్న సినిమాను సక్సెస్ చేసుకోవడమే. యావరేజ్ గా వచ్చిన టాక్ ను సూపర్ హిట్ చేసుకోవడంలో స్టార్ సత్తా ఏంటి అన్నది తెలుస్తుంది. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం మొదట ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కలక్షన్స్ మాత్రం దుమ్ముదులిపేస్తున్నాయి.


డిజె విషయంలో చరణ్ మరింత హెడేక్ ఫీల్ అవుతున్నాడు. ముందు టాక్ బాగాలేకున్నా సరే బన్ని సినిమా కలక్షన్స్ చేస్తున్న ప్రభంజనం చెర్రికి నిద్రపట్టకుండా చేస్తుందని అంటున్నారు. ధ్రువ సక్సెస్ తో మళ్లీ ట్రాక్ ఎక్కిన చరణ్ ప్రస్తుతం సుకుమార్ తో రంగస్థలం 1985 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా హిట్ తో ఈ లెక్క సరిచేయాలని చూస్తున్నాడు చరణ్. 


ఇక పైకి ఇద్దరు మంచిగా కనిపిస్తున్నా చరణ్, బన్నిల మధ్య కొంత గ్యాప్ అయితే వచ్చింది అన్నది తెలుస్తుంది. అంతేకాదు నిన్న జరిగిన డిజె థ్యాంక్స్ మీట్ లో కూడా చరణ్ మెగా ఫ్యామిలీకి సంబందించిన హీరోలనెవరిని పిలవకపోవడం ఆశ్చర్యంగా ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: