‘జబర్దస్త్’ షోతో క్రేజ్ లోకి వచ్చిన కమెడియన్ ధన్ రాజ్ ఆతరువాత సినిమాలలో కూడ బాగా బిజీగా మారాడు. అయితే ఆతరువాత అతడు హీరో అయిపోదామని ప్రయత్నాలు చేసి ఒక హాస్య సినిమాను తీసి ఆసినిమా వల్ల ఆర్ధికంగా నష్టపోయాడు అన్న వార్తలు వచ్చాయి. దీనితో మళ్ళీ ధన్ రాజ్ మళ్ళీ కోలుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ అనేక సినిమాలలో నటించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. 

ఇది ఇలా ఉండగా ఈ కమెడియన్ కష్టాలకు ఊహించని అదృష్టం జూనియర్ రూపంలో వచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్న “బిగ్ బాస్” కోసం సెలబ్రిటీల ఎంపిక జోరుగా సాగుతున్న నేపధ్యం తెలిసిందే. మరొక ప్రక్కన ఈ షో షూటింగ్ ప్రారంభం కాకుండానే జూనియర్ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రమోషన్ వీడియోలను విడుదల చేస్తూ ఈ కార్యక్రమం పై జోష్ ను పెంచుతున్నాడు. 

ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం మేరకు ధన్ రాజ్ ను ‘బిగ్ బాస్’ షో నిర్వాహకులు సంప్రదించగా ఆ షోలో చేయడానికి ధన్ రాజ్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్ రాజ్ కు భారీ పారితోషికం కూడ ఇస్తున్నట్లు టాక్. దీనికి సూచనగా ఈ కమెడియన్ ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను 71 రోజుల పాటు ఓ ప్రత్యేక కార్యక్రమానికి వెళ్తున్నానని ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చాడు. 

అయితే ఇక్కడ ‘బిగ్ బాస్’ అన్న కార్యక్రమం పేరు వెల్లడించలేదు కానీ అది ఆకార్యక్రమ నిర్వాహకులు ప్రకటిస్తేనే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని తెలియచేసాడు. ఇప్పటికే ఈషోలో పోసాని తేజస్వినీ మధుషాలినీ ఎంపిక అయిన నేపధ్యంలో వారితోపాటు ఈషోకు ధన్ రాజ్ ఎంపిక కావడం అతడి అదృష్టం అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: