మహేష్ ఏంటి స్మార్ట్ సిఎం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ మళ్లీ కలిసి చేస్తున్న సినిమా భరత్ అను నేను. స్పైడర్ రిలీజ్ కాకుండానే ఈ సినిమా షురూ చేశాడు మహేష్. సినిమాలో ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు మహేష్. అందుకే సినిమా లుక్ విషయంలో కొత్తగా కనిపిస్తాడట.


ఇప్పటికే మొదటి షెడ్యూల్ మహేష్ లేకుండా కానిచ్చిన కొరటాల శివ సెకండ్ షెడ్యూల్ లో మహేష్ తో ఇంపార్టెంట్ సీన్స్ చేస్తున్నారట. సినిమా కోసం హైదరాబాద్ ఆఎఫ్సీలో అసెంబ్లీ సెట్ కూడా వేశారని తెలుస్తుంది. సినిమాలో మహేష్ సిఎంగా చేస్తున్నాడు అయితే ఆ లుక్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.


సడెన్ గా ఈరోజు సోషల్ మీడియాలో మహేష్ భరత్ అను నేనుకి సంబందించిన ఫోటో లీక్ అయినట్టు తెలుస్తుంది. మహేష్ టీ షార్ట్ తో ఉన్న ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. స్మార్ట్ సిఎం టీ షర్ట్ తో ఆకట్టుకుంటాడని అంటున్నారు. మహేష్ లుక్ వైజ్ పెద్దగా మార్పులేమి లేవు అయితే సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా చేసే సీన్స్ మాత్రం కొత్తగా ఉంటాయని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: