నిర్మాత దిల్ రాజ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కి మారు పేరులా వెలిగిపోతున్న నేపధ్యం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘శతమానం భవతి’ ‘నేను లోకల్’ సినిమాల ఘన విజయం తరువాత గత వారం వచ్చిన ‘దువ్వాడ జగన్నాధమ్’ వరకు దిల్ రాజ్ తీసిన సినిమాలు విజయవంతం అయిన నేపధ్యంలో దిల్ మంచి జోష్ లో ఉన్నాడు. 

ప్రేక్షకుల నాడి తెలిసిన నిర్మాతగా ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటున్న దిల్ రాజ్ మరో సంచలనాత్మక మూవీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎందరో టాప్ హీరోలతో సినిమాలు తీసిన దిల్ రాజ్ కు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలి అన్నది అతడి జీవిత ఆశయం. 

ఈవిషయాన్ని అనేక ఇంటర్వ్యూలలో స్వయంగా దిల్ రాజ్ చెప్పాడు. ఇప్పుడు ఆ కల నెరవేరే రోజులు దగ్గరలో ఉన్నాయని దిల్ రాజ్ చెపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డివైడ్ టాక్ లో కూడ ‘దువ్వాడ’ సాధించిన ఘన విజయంతో తనను అభినందిస్తున్న తన సన్నిహితులతో తన భవిష్యత్ సినిమాల గురించి మాట్లాడుతూ ఇలా పవన్ సినిమా గురించి లీకులు ఇస్తున్నట్లు టాక్. 

ఈమధ్య తాను పవన్ ను కలిసి తనతో చేయబోయే మూవీ పై క్లారిటీ ఇచ్చానని పొలిటికల్ టచ్ లో ఉండే కథతో పవన్ సినిమా ఉండబోతోంది అన్న విషయాన్ని తన సన్నిహితులతో దిల్ రాజ్ లీకులు ఇస్తున్నట్లు సమాచారం. అయితే ఈసినిమాకు సంబంధించి కేవలం ఒక ఆలోచన మాత్రమే తనకు పవన్ కు మధ్య చర్చల రూపంలో జరిగిందని ఈ సినిమాకు సంబంధించిన టోటల్ స్క్రిప్ట్ దర్శకుడు ఖరార్ కావలసి ఉంది అని దిల్ రాజ్ అంటున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసిన తరువాత మైత్రి మూవీస్ సంస్థకు ఒక సినిమాను చేస్తున్న నేపధ్యంలో పవన్ దిల్ రాజ్ సినిమాను వచ్చే ఏడాది మధ్యలో మొదలు పెట్టి 2019 సంక్రాంతికి విడుదల అయ్యే విధంగా ఈ పొలిటికల్ పంచ్ మూవీ విడుదలకు దిల్ రాజ్ యాక్షన్ ప్లాన్ కూడ డిజైన్ చేసినట్లు టాక్. అయితే పవన్ మాటలు ఇచ్చిన వాగ్దానాలు క్షణం క్షణం మారిపోయే పరిస్థుతులలో పవన్ దిల్ రాజ్ ల మూవీ అసలు పట్టాల పైకి ఎంతవరకు వస్తుంది అన్నదే సందేహం..   
 



మరింత సమాచారం తెలుసుకోండి: