చైనాలో విడుదలై సంచలనాలు సృట్టిస్తున్న ‘దంగల్’ ప్రపంచ వ్యాప్తంగా 2000 కోట్ల మూవీగా మారుతున్న నేపధ్యంలో ఇండియన్ హైయస్ట్ గ్రాసర్ గా ‘బాహుబలి 2’ క్రియేట్ చేసిన రికార్డులను అధిగమించి ‘దంగల్’ ‘బాహుబలి 2’ రికార్డుల గౌరవాన్ని మూడు నాళ్ళ ముచ్చటగా మార్చి వేసిన నేపధ్యం తెలిసిందే. దీనితో ‘బాహుబలి 2’ చైనాలో విడుదల అయిన తరువాత ఆమూవీ ‘దంగల్’ రికార్డులను క్రాస్ చేయగలుగుతుందా అన్న ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

ఇది ఒక విధంగా ‘బాహుబలి’ నిర్మాతలకు అదే విధంగా రాజమౌళికి ఊహించని షాక్ గా మారింది అని అనిపించడం సహజం. ఈ నేపధ్యంలో ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి దంగల్ కలెక్షన్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం చైనాలో ‘దంగల్’ సృష్టిస్తున్న సంచలనాలు ‘బాహుబలి 2’ కు అదృష్టంగా మారాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

అంతేకాదు ‘దంగల్’ తో చైనా ప్రేక్షకులకు ఇండియన్ సినిమాల పట్ల బాగా ఆసక్తి పెరిగిందని ఈ పరిస్థుతులు ‘బాహుబలి 2’ కు అనుకూలంగా మారబోతున్నాయి అన్న సంకేతాలు ఇచ్చాడు రాజమౌళి. అదేవిధంగా ‘బాహుబలి 2’ పట్ల చైనా ప్రేక్షకులలో బాగా ఆసక్తి పెరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈసినిమాను చైనా ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా పాటలు మరికొన్ని సన్నివేశాలు కట్ చేసి అత్యంత భారీ స్థాయిలో ‘బాహుబలి 2’ ను విడుదల చేయబోతున్న విషయాన్ని ప్రస్తావించాడు రాజమౌళి. 

దీనితో ఎంతో వ్యూహాత్మకంగా రాజమౌళి దంగల్ పై చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘దంగల్ 2 వేల కోట్ల రికార్డును బ్రేక్ చేస్తాను అని రాజమౌళి చెపుతున్న మాటలు అతడి ఆత్మ విశ్వాసాన్ని సూచిస్తున్నాయి. ఒకవైపు ‘దంగల్’ ను పోగొడుతూనే మరొకవైపు ‘బాహుబలి 2’ ను చైనా మార్కెట్ లో తెలివిగా ప్రమోట్ చేస్తున్న రాజమౌళి తెలివితేటలు అతడి ముందు చూపును సూచిస్తున్నాయి అన్న కామెంట్స్ ఈ ఇంటర్వ్యూను బట్టి తెలుస్తుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: