మహేష్ ‘శ్రీమంతుడు’ సినిమా విడుదలై దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా ఆ సినిమాలో హీరో ఒక ఊరుని దత్తత తీసుకునే ఆలోచన ఎందరో సెలెబ్రెటీలను ప్రభావితం చేస్తూనే ఉంది. దీనికితోడు ఈ ఆలోచనలు అన్నీ మన ప్రధానమంత్రివి కావడంతో ‘శ్రీమంతుడు’ లోని ఊరు దత్తత సీన్స్ కు సెలెబ్రెటీల నుండి సామాన్యుల వరకు చాల సులువుగా కనెక్ట్ అయిపోయారు. 

ఇలాంటి నేపధ్యంలో నిజమైన ‘శ్రీమంతుడు’ ప్రకాష్ రాజ్ అంటూ కొంతమంది అతడి అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు.  మాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్‌ చుట్టూ 2 సంవత్సరాల క్రితం విపరీతమైన హడావిడి చేసాయి. సినిమా స్టార్స్ నుండి రాజకీయ నాయకుల వరకు చాలామంది చాల గ్రామాలను దత్తత తీసుకున్నారు. 

అయితే ఇప్పుడు ఆ హడావిడి తగ్గి పోవడంతో చాలామంది ఆ కార్యక్రమం గురించి మర్చిపోయారు. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లెను దత్తత తీసుకుని ప్రకాష్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆ ఊరి ప్రజలు నిజమైన శ్రీమంతుడు గా ప్రకాష్ రాజ్ ను గౌరవిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

గ్రామాలు అంటే విపరీతమైన అభిమానం ఉన్న ప్రకాష్ రాజ్ తన మాట ప్రకారం దత్తత తీసుకున్న కొండారెడ్డి పల్లెను ఒక ఆదర్శ వంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఊరి ప్రజలకు కావలసిన కనీసపు సౌకర్యాలను ఏర్పరచడమే కాకుండా ఈమధ్య జరిగిన రంజాన్ పండుగ సందర్భంగా ఒక నిరుపేద ముస్లిమ్ కుటుంబానికి ఆ గ్రామంలో ఒక ఇల్లు కట్టించి ప్రకాష్ తన నిండు మనసును చాటుకున్నట్లు తెలుస్తోంది. 

చాలామంది టాలీవుడ్ టాప్ హీరోలు తమ కుటుంబ నేపధ్యానికి సంబంధించిన గ్రామాలను దత్తత తీసుకుని హడావిడి చేసినా ఆ టాప్ హీరోలు ఎవ్వరూ ఇంకా పూర్తి చేయని పనులను ప్రకాష్ రాజ్ తన దత్తత గ్రామంలో పూర్తి చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచే విషయంగా మారింది. ప్రకాష్ రాజ్ ఒక సినిమాలో చెప్పే ‘నేనే మోనార్క్’ డైలాగ్ ప్రకాష్ రాజ్ సేవా కార్యక్రమాలలో కూడ నిరూపించుకుంటున్నాడు అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: