టాలీవుడ్ లో మొన్నటిదాకా హిట్ కోసం తపించిపోయినా పూజా ఎట్టకేలకు డిజెతో తన మీద ఉన్న ఐరన్ లెగ్ పేరుని పోయేలా చేసుకుంది. ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో నటించిన ఈ అమ్మడు వాటి ఫ్లాప్స్ కు కారణమని అప్పట్లో అన్నారు. తీరా డిజెలో సక్సెస్ క్రెడిట్ లో పూజా గ్లామర్ ఎక్కువ పాత్ర పోశించిందని చెప్పొచ్చు.


ఏకంగా బికినితో తెలుగు ప్రేక్షకులను ముచ్చటపరచింది పూజా హెగ్దె. సినిమాలో స్కిన్ షోతో అదరగొట్టిన పూజా డిజె థ్యాంక్ యు మీట్ లో కూడా తొడలు కనిపించే డ్రెస్ తో అందరి కళ్లు తన మీదే ఉండేలా చేసుకుంది. కొద్దిపాటి క్రేజ్ వచ్చిందో లేదో అమ్మడు దాన్ని డబుల్ చేసుకునే ప్రయత్నంలో మునిగితేలుతుంది.   


వచ్చిన అన్ని అవకాశాలను పూజా అలా వాడేసుకుంటుందని అనుకోవచ్చు. స్టైలిష్ స్టార్ పక్కన స్టైలిష్ హీరోయిన్ గా ప్రమోట్ అవుతున్న ఈ భామ తెలుగులో ఇక నుండి మంచి అవకాశాలు అందుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరక్షన్ లో చేస్తున్న మూవీలో పూజాని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట.


ఇక మరో పక్క ప్రభాస్ తో కూడా జోడి కట్టించాలని చూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి సినిమాలో కూడా పూజా హెగ్దె ఆల్మోస్ట్ ఓకే అంటున్నారు. సో మొత్తానికి డిజె హిట్ తో పూజా ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ ఐకాన్ గా మారిందని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: