పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఏ దర్శక నిర్మాతకు సినిమా తీయాలని ఉండదు చెప్పండి. డిస్ట్రిబ్యూటర్ నుండి పవర్ స్టార్ మీద అభిమానంతో తన సినిమా కోసం ప్రయ్త్నం చేసిన దిల్ రాజు ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ పట్టేశాడు. ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న పవన్ ఆ తర్వాత సంతోష్ శ్రీనివాస్ సినిమా చేస్తాడని అంటున్నారు.


రీసెంట్ గా త్రివిక్రం సినిమా సెట్స్ కు వెళ్లిన దిల్ రాజు పవన్ తో తన సినిమా గురించి ప్రస్తావించారట. కథ ఉంటే చేసేద్దాం అని చెప్పారట. సో ఇక దిల్ రాజు కథ వేట కొనసాగిస్తున్నాడని తెలుస్తుంది. పవర్ స్టార్ తో ఎన్నాళ్ల నుండో సినిమా తీద్దామనుకున్న దిల్ రాజు తన దగ్గర ఉన్న దర్శకులందరికి కథ సిద్ధం చేయాలని ఆర్డర్ వేశాడట.


కచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేలా ఉండాలని చెబుతున్నాడట. పవర్ స్టార్ ఇమేజ్ కు మంచి సబ్జెక్ట్ అదిరగొట్టే డైరక్షన్ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అన్నట్టే. పవన్ స్టైల్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఓ మంచి స్టైలిష్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట దిల్ రాజు. కథ పవన్ ఓకే చేయగానే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది.


ఇక 2019 ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశంతో పవన్ తను కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలను త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. దిల్ రాజు సినిమా డైరక్టర్ ఎవరై ఉండొచ్చు అన్న దాని మీద సోషల్ మీడియాలో ఒకటే చర్చ జరుగుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: