తెలుగు ఇండస్ట్రీలో హీరోల వారసులు వస్తున్న సమయంలో స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు తనయుడు దగ్గుబాటి వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  మాస్, క్లాస్ హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన  విక్టరీ వెంకటేష్ గత కొంత కాలంగా ఫ్యామిలీ, కామెడీ చిత్రాల్లో నటిస్తూ మంచి ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నారు.  అయితే ఇండస్ట్రీలో ఇప్పటి వివాదాలకు దూరంగా ఉంటున్న వెంకటేష్ తాజాగా సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు.  ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటీ అంటారా..!  బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్‌‌గా ప్రచారమవుతున్న ఐలియా వాంటర్‌తో కలిసి కారులో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.  

వాంటర్‌తో కలిసి వెంకటేష్ కారులో వెళ్తూ కెమెరాకి చిక్కాడు. ఈ ఇద్దరిపై రకరకాల వార్తలు హంగామా చేస్తున్నాయి. వెంకీ గతంలో ఓ రెండు బాలీవుడ్ సినిమాల్లో నటించాడు.  ప్రస్తుతం వెంకటేష్ అన్న స్టార్ ప్రొడ్యూసర్ డి సురేష్ బాబు తనయుడు రానా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.  ఈ నేపథ్యంలో అయితే వెంకీ, సల్మాన్‌తో కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తాడా? లేక సల్మాన్ సొంత బ్యానర్‌లో ఏమైనా సినిమా చేస్తున్నాడా..? అని రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.  

వాస్తవానికి సల్మాన్, వెంకటేష్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్..హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా సల్మాన్ ఖాన్ విక్టరీ వెకంటేష్ ని తప్పకుండా కలుస్తాడు.  అంతే కాదు  గే సల్మాన్ తనకు సోదరుడి లాంటోడని విక్టరీ చెప్పిన సంగతి తెలిసిందే! వీలైతే తాము ఓ మూవీ చేస్తామని అప్పట్లో చెప్పుకొచ్చాడు.
Image result for venkatesh salman khan
ఇక అసలు విషయానికి వస్తే..ఇటీవల ఓ పార్టీలో సల్మాన్‌, లులియాతో వెంకీ సమావేశమయ్యాడని, దీనికి పార్టీలో పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా హాజరయ్యారు.  పార్టీ ముగిసిన తర్వాత లులియాతో కలిసి వెంకటేష్ ఇలా కనిపించాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు కొన్ని బయటకు రావడంతో సెన్సేషన్ క్రియేట్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: