తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో లైవ్ ప్రోగ్రామ్స్ చూశాం.  అయితే ఈ మద్య స్టార్ హీరోలు సైతం బుల్లితెరపై సందడి చేస్తున్న విషయం తెలిసిందే.  ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తో అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు.  ఇక బాలీవుడ్, కోలీవుడ్,శాండిల్ వుడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది బిగ్ బాస్ షో.  ఇప్పుడు తెలుగు బుల్లితెరపై  ‘బిగ్ బాస్’ షోకి నందమూరి కుర్రోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.  గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించి రెండు ప్రోమోలు,ఫస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో దుమ్ము దులిపేశాయి.
Image result for bigg boss ntr
రొటీన్ ప్రోగ్రాంల్లా ఇందులో స్టార్ట్ కెమెరా... కట్ లాంటివేం ఉండవు.  12 మంది సెలబ్రిటీలు 70 రోజులపాటు ప్రపంచానికి దూరంగా కలిసి ఎలా ఉంటారన్నదే బిగ్ బాస్ కాన్సెప్ట్. 60 కెమెరాలు వీరి కదలికలను నిరంతరం చిత్రీకరిస్తూనే ఉంటాయి.  ఈ ప్రాజెక్టు కోసం 750 మంది టైంతో సంబంధం లేకుండా పని చేస్తున్నారు.  అంతే కాదు ఇప్పటి వరకు ఏ టీవి షోకి చేయని హంగామా దీనికోసం చేస్తున్నారు..ఈ షో కోసం 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత భారీ సెట్ వేశారు.  
Image result for bigg boss ntr
బిగ్ బాస్ కాంటెస్ట్ లో పాల్గొనేందుకు చాలా మంది సెలబ్రెటీలను సంప్రదించారట..అయితే అందులో 12 మందిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ షో తెలుగు టీవీలకు గేమ్ ఛేంజర్ అవుతుందని హోస్ ఎన్టీఆర్ గతంలోనే చెప్పాడు. ఇక బిగ్ బాస్ షో అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి బుల్లితెరపై ఓ ప్రత్యేక ప్రోగ్రామ్ వస్తుందని అందరూ అనుకుంటున్నారు. అంతే కాదు  మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ఓ టీవీ షోకు హోస్ట్ చేయబోతున్నాడు. ఈ షో కోసం బుల్లితెర ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.  మరి వెండితెరై తన జోరు కొనసాగిస్తున్న యంగ్ టైగర్ బుల్లితెరపై ఎలా మెప్పిస్తోడో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: