గత కొంత కాలంగా భారతీయ చలన చిత్ర రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి.  ముఖ్యంగా టెక్నాలజీ అభివృద్ది చెందుతున్న సమయంలో గ్రాఫిక్స్ మాయాజాలంతో తెరపైకి ఎన్నో సినిమాలు వచ్చాయి.  ఇక హాలీవుడ్ లో అయితే ఏ ప్రతి సినిమా గ్రాఫిక్స్ పై ఆదారపడి తీస్తున్నారంటే అతిశయోక్తి లేదు.  ఇక భారతీయ చలన చిత్రాలు కూడా చాలా వరకు గ్రాఫిక్స్ తో కూడుకున్నవే వస్తున్నాయి.  అలా అని అన్ని సినిమాలు గ్రాఫిక్స్ నే నమ్ముకొని లేకుండా మంచి కథ, కథనాలు, నటన, సంగీతం అన్ని కలిసొస్తే ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది.
Image result for baabubali 2
 ఒకప్పుడు ఎన్ని రోజులు థియేటర్లలో సినిమా నిలిచిందన్నదాన్ని బట్టి హిట్ స్థాయిని అంచనా వేసేవారు.  ఇప్పుడు ట్రెండ్ మారింది..స్టార్ సినిమాలు ముహుర్త షాట్ నుంచి కలెక్షన్లు వచ్చే వరకు విపరీతమైన హైక్ తీసుకు వస్తున్నారు.  ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్లు బట్టి సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో చెబుతున్నారు.   కథలో దమ్ము ఉంటే కలెక్షన్లు వాటంతట అవే వస్తాయని సినీ వర్గాలు చెబుతుంటాయి. అలాగే హీరోల స్టార్‌డమ్‌ను బట్టి కూడా ఫ్లాప్ సినిమా అయినా రికార్డు స్థాయి కలెక్షన్లు వస్తాయని పలుమార్లు రుజువయ్యాయి.
Image result for dangal movie
తాజాగా భారతీయ సినీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే సత్తా తెలుగు ఇండస్ట్రీకి కూడా ఉందని బాహుబలి-2 నిరూపించింది. ఇక బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసింది.   మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-10 సినిమాలు. 


1. దంగల్- 1862 కోట్ల రూపాయలు 
2. బాహుబలి-2- 1623 కోట్ల రూపాయలు 
3. పీకే- 792 కోట్ల రూపాయలు
4. బాహుబలి-1: 650 కోట్ల రూపాయలు
5. భజరంగీ భాయీజాన్: 626 కోట్ల రూపాయలు
6. ధూమ్-3: 585 కోట్ల రూపాయలు
7. సుల్తాన్: 584 కోట్ల రూపాయలు
8. కబాలి: 477 కోట్ల రూపాయలు
9. ప్రేమ్ రతన్ దన్ పాయో: 432 కోట్ల రూపాయలు
10. చెన్నై ఎక్స్‌ప్రెస్: 423 కోట్ల రూపాయలు



మరింత సమాచారం తెలుసుకోండి: