సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది అత్యంత ప్రాణ స్నేహితులుగా మెలిగే వారు ఉంటారు.  వారి స్నేహం గురించి అప్పుడప్పుడు చెప్పుకొని తెగ మురిసిపోతుంటారు.  తాజాగా సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ప్రధానోత్సవానికి ప్రముఖ తెలుగు సినీ నటుడు రానా వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెల్సుకదా.  ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రశాంతంగా కూల్ గా ముగించేశారు. అయితే వ్యాఖ్యాతగా వ్యవహరించిన రానా ను మీడియా వారు కొన్ని ప్రశ్నలు అడిగారు.  
Related image
ఈ సందర్భంగా తన బ్రెస్ట్ ఫ్రెండ్, తనకు నచ్చిన చోటు, ఇష్టమైన ఫుడ్ లాంటి విషయాలను ఏ మాత్రం తడబడకుండా టక టక చెప్పేశాడు రానా. అయితే అప్పుడు రానా చెప్పిన సమాధానలు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ సందర్భంగా రానా మరికొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు.   ఒకే పాటను జీవితాంతం వినాల్సి వస్తే బాహుబలి సినిమాలోని మహిష్మతి టైటిల్ సాంగ్ నే వింటాడట.
Rana about Ramcharan in Sima award function 2017
ఎప్పటికీ ఒకే నగరంలో ఉండాల్సి వస్తే హైదరాబాద్, ఒకే ఫుడ్ తినాల్సి వస్తే హాలీమ్, ఒకే సినిమా రోజూ చూడాల్సి వస్తే స్టార్ వార్స్ సినిమాలు చూస్తాడట. ఒకే షో ఎప్పటికీ చూడాల్సి వస్తే మాత్రం టీవీ ఆఫ్ చేసేస్తానన్నాడు రానా. ఒకే మనిషి జీవితాంతం ఫ్రెండ్ గా ఉండాల్సి వస్తే ఆ ప్లేస్ రామ్ చరణ్ కు మాత్రమే ఇస్తా అన్నాడు.  తన చిన్ననాటి నుంచి చెర్రితో మంచి స్నేహం ఉందట.
Image result for rana family
అంతే కాదు చిన్నప్పటి నుంచి స్టార్ కుటుంబంలో పెరగడంతో తనకు ఇష్టమైన స్టార్ అని ఎవరూ చెప్పలేని అంటున్నాడు. అయితే ఒక లవ్ ఎమోజీ ఇప్పుడు మీకు ఇస్తే ఇక్కడకు వచ్చిన వాళ్ళలో ఎవరికి ఇస్తారు అని అడిగితే.. టక్కున నటి ఖుష్బూ కు ఇస్తాను అన్నాడు. నాకు ఆవిడ తల్లి లాంటిది'' అని చెప్పాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: