నాచురల్ స్టార్ నాని హీరోగా హను రాఘవపుడి డైరక్షన్ లో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమా కథ మొత్తం బోర్డర్ లోనే ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా నాని ఓ జవాన్ గా కనిపించబోతున్నాడు. హను రాఘవపుడితో నాని ఆల్రెడీ కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమా తీశాడు. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది.


ఇక ఈ ఇయర్ ఇప్పటికే నేను లోకల్ హిట్ అందుకున్న నాని రీసెంట్ గా వచ్చిన నిన్ను కోరి సినిమాతో కూడా మరో సూపర్ హిట్ కొట్టాడు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మొదలైన నాని హిట్ మేనియా డబుల్ హ్యాట్రిక్ క్రాస్ చేసి ట్రిపుల్ హ్యాట్రిక్ కోసం దూసుకెళ్తున్నాడు నాని. నిన్ను కోరి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాని ప్రస్తుతం వేణు శ్రీరాం తో ఎం.సి.ఏ సినిమా సెట్స్ మీద ఉంది. 


ఇక ఆ సినిమా తర్వాత మేర్లపాక గాంధి డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేశారు. ఆ తర్వాత హనుతో సినిమా ఉంటుందట. దేశ రక్షకుడిగా నాని మరోసారి తన టాలెంట్ చూపించేందుకు సిద్ధమయ్యాడు. పెరిగిన ఇమేజ్ తో నాని కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నాడు. నిన్ను కోరి మొదటి రోజు కలక్షన్స్ ఓ స్టార్ హీరో సినిమాకు వచ్చినంతలా ఉన్నాయంటే నాని ఫాం ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: