తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా పేరు తీసుకు రాలేక పోయినా..ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘చత్రపతి’ చిత్రంతో ఒక్కసారే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఆ తర్వాత వచ్చి డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న ప్రభాస్ మరోసారి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’, ‘బాహుబలి 2 ’ చిత్రాలతో ఏకంగా జాతీయ స్థాయిన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  

దీంతో ఇప్పుడు ప్రభాస్ ని హీరోగా పెట్టి సినిమా తీయాలని బాలీవుడ్, కోలీవుడ్ దర్శక,నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు.  తాజాగా ప్రభాస్ కి మరో అరుదైన గౌరవం లభించింది. తాజాగా ఓ మ్యాగజైన్ దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు అంటూ ఓ కథనాన్ని ప్రచురించింది కాగా ఆ కథనంలో దక్షిణాది నుండి కేవలం ఒకే ఒక హీరో ప్రభాస్ కే స్థానం దక్కింది.  
Image result for prabhas
ఇక బాహుబలి మానియా మొదలైనప్పటి నుంచి జాతీయ స్థాయిలో ఎవరైనా దక్షిణాది నుండి హీరోలను గుర్తింపు ఇవ్వాలంటే ముందుగా ప్రభాస్ పేరుతోనే మొదలు పెడుతున్నారు.  దక్షిణాదిన ఇంకా టాప్ స్టార్స్ ఎంత మంది ఉన్నా వాళ్ళని మాత్రం పరిగణలోకి తీసుకోలేదు కానీ ప్రభాస్ పేరు మాత్రం పదే పదే రావడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Image result for baahubali 2
అయితే ప్రభాస్ గత ఐదు సంవత్సరాల నుంచి కేవలం బాహుబలి, బాహుబలి 2 చిత్రాలకు మాత్రమే తన టైమ్ కేటాయించడం తాను పడ్డ కష్టానికి ప్రతిఫలం రావడం అంతా ‘బాహుబలి’ ప్రభావం అని అంటున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: