అనుకున్నట్టుగానే మలయాళ నటి భావన కేసులో స్టార్ హీరో దిలీప్ అరెస్ట్ అయ్యారు. ఫిబ్రవరిలో జరిగిన భావన లైంగిక దాడి కేసులో నిందితుడు పల్సర్ సుని పోలీస్ రిమాండ్ లోనే ఉన్నాడు. ఇక అతను బయట పెట్టిన విషయాలతో అనుమాతిడైన మలయాళ హీరో దిలీప్ ను కొద్ది రోజులుగా విచారిస్తూ వస్తున్నారు. ఇక ఫైనల్ గా ఐదు గంటల పాటు జరిగిన దిలీప్ పోలీసుల విచారణలో ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది.


వ్యక్తి గత కక్ష్యల వల్లే భావన అప్పటి కార్ డ్రైవర్ ఇంకా మాజీ డ్రైవర్ తో ఈ తతంగమంతా నడిపించారు. పల్సర్ సుని చెప్పిన ఇచ్చిన సమాధానాలతో మలయాళ స్టార్ హీరో హస్తం ఉందని అంతా అనుకున్నారు. అయితే అప్పుడే ఆ స్టార్ హీరో దిలీపే అని ఫిక్స్ చేశారు. ఈమధ్యన పల్సర్ సునితో కూడా దిలీప్ మాట్లాడేందుకు ప్రయత్నించాడని వార్తలు వచ్చాయి.


ఇక ఫైనల్ గా దిలీపే ప్రధాన నిందితుడని తేలింది. అందుకే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. భావంతో దిలీప్ కు ఎలాంటి గొడవలున్నాయో తెలియదు కాని రెండు గంటల పాటు ఆమెను చిత్రవద చేసి మరి హింసించారని తెలిసిందే. అప్పట్లో దేశం మొత్తం సంచలనం సృష్టించిన ఈ కేసులో దిలీప్ కు బాగానే షాక్ తగిలే అవకాశాలున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: