Image result for vinayan dileep bhavana 

రీల్ లైఫ్ హీరోలు రియల్ లైఫ్ లో ఎలాంటి పరిస్థితుల్లో హీరోలు అవ్వాలనే రూలేమీ లేదు. సినిమా రంగములొ అనేకమంది కథానాయకులు ఆ చిత్ర పరిశ్రమను తమ పిడికిట్లో బందించాలని చూసిన సన్నివేశాలు భారత సినిమా రంగంలో అనేకం. మహా మహా నటులనదగిన వాళ్ళెవరూ ఈ అభియోగానికి అనర్హులుకాదు. అదే పరిస్థితి మళయాల చిత్ర పరిశ్రమ దీనికి అతీతం గాదు. 


షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళుతున్న ప్రముఖ మలయాళీ నటిపై కొందరు వ్యక్తులు లైగింక దాడికి పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు ఐదు నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు చేస్తున్న దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చింది. సుదీర్ఘ విచారణల అనంతరం అనుమానితుడుగా ఉన్న ప్రముఖ నటుడు దిలీప్‌ను కేరళ పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. 


జూన్ 28న పల్సర్ సునీని కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు అతడి నుంచి చాలా విషయాలు రాబట్టారు. దిలీప్ సినిమా షూటింగ్ స్పాట్లకు రేపిస్ట్ సునీ చాలా సార్లు వెళ్లి, అతడిని కలిసినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ఆ నటిపై ఉన్న వ్యక్తిగత కక్షతోనే ఆమె కెరీర్‌ను నాశనం చేయాలని రెండేళ్ల నుంచి దిలీప్ ప్లాన్ చేసినట్లు విచారణలో బయటపడింది. అందుకోసం సునీకు దిలీప్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లు సిట్ అధికారుల దర్యాప్తు లో బయటపడింది. సునీతో పాటు మరో నిందితుడు జిన్సన్ స్టేట్‌మెంట్‌ను కూడా సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఒక చార్జిషీట్‌ను ఫైల్ చేసిన సిట్ అధికారులు తాజాగా మరో చార్జిషీట్‌ను ఫైల్ చేసి నిందితులకు తగిన శిక్ష పడేలా చేయనున్నారు.


 మలయాళీ నటిపై లైంగిక దాడి కేసులో అరెస్టయిన ప్రముఖ హీరో దిలీప్ గురించి మళయాళ దర్శకుడు వినయన్ సంచలన విషయం బయటపెట్టారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులను దిలీప్ తన గుప్పిట్లో పెట్టుకున్నాడని, ఫిల్మ్ అసోసియేషన్‌లో ప్రధానమైన వ్యక్తిగా ఉన్న దిలీప్‌ను తొలగించేందుకు పరిశ్రమలోని పెద్దలెవరూ ధైర్యం చేయలేకపోయారని మలయాళంలో ప్రముఖ డైరెక్టర్‌గా ఉన్న వినయన్ వెల్లడించారు. 


నటిపై లైంగిక దాడి ఘటన అనంతరం దాని వెనుక ఉన్నది దిలీపేనని తెలిసినా అతడి గురించి ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, బాధిత నటికి మద్దతు ఇచ్చేందుకుకూడా ఎవరూ ముందుకు రాకపోవడం సిగ్గుచేటని వినయన్ వ్యాఖ్యానించారు. బాధిత నటి తన గుప్పిట్లోకి రావడం లేదనే కక్షతోనే ఆమెపై దాడి చేయించాడని డైరెక్టర్ వినయన్ ఆరోపించారు.


ప్రముఖ నటుడి అరెస్టుతో కేరళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దిలీప్ అరెస్టుపై స్పందించేందుకు నిర్మాతలు, నటీనటులు ఎవరూ ముందుకు రాలేదు. కేరళలోని తిరువనంతపురం పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 17 కారులో ప్రయాణిస్తున్న ఒక నటిని అపహరించి, లైంగిక దాడికి పాల్పడిన కేసులో అనుమానితుడుగా ఉన్న ప్రముఖ నటుడు దిలీప్‌ను కేరళ పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: