తెలుగు ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తమన్నా.  తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా పేరు తీసుకు రాకపోయినా..రాంచరణ్ తో నటించిన ‘రచ్చ’తో మంచి గుర్తింపు వచ్చింది.  తెలుగు, తమిళంలో నటిస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.  అక్కడ పెద్దగా వర్క్ ఔట్ కాకపోవడంతో తెలుగులో కొన్ని ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించింది.  ఇక ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంతో అవంతిక పాత్రతో నిజంగా అప్సరసలా కనిపించింది.  
Image result for tamanna bahubali
బాహుబలి 2 చిత్రంలో తన పాత్రపై ఎన్నో కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో నిజంగా ఈ చిత్రంలో తనకు అన్యాయం జరిగిందని వాపోయింది. ఈ మద్య మిల్కీబ్యూటీ తమన్నా ఇంట్లో పెళ్లి వేడుక జరిగింది. ఇన్నాళ్లు అంటే సినిమాలు షికార్లు అంటూ కాలం వెళ్లబుచ్చింది కానీ ఇపుడు మాత్రం పెళ్లి మీద మనసు మళ్లింది దాంతో తన తల్లిదండ్రులకు పెళ్ళికొడుకుని చూడమని చెప్పిందట.
Image result for prabhu deva tamanna
ఇక ప్రభుదేవ తో ‘అభినేత్రి’ సినిమాలో నటించించిన విషయం తెలిసిందే.   ఆ మద్య ప్రభుదేవకి, తమన్నాకు మద్య అదేదో నడుస్తున్నట్లు రూమర్లు కూడా పుట్టుకొచ్చాయి.  ఇంకొన్నాళ్లు ఇలాగే ఉంటే మరిన్ని రూమర్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని త్వరగా పెళ్లి చేసుకుంటే వాటన్నింటికి చెక్ పెట్టొచ్చని భావిస్తుంది తమన్నా. ప్రస్తుతం తన సహనటీమణులు కూడా పెళ్లి చేసుకుంటున్న తరుణంలో తమన్నా కూడా పెళ్లికి సిద్దమైనట్లు తెలుస్తుంది. 
Image result for tamanna item song
 ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లో ఒకటీ రెండు సినిమాల్లో నటిస్తున్న తమన్నా తెలుగులో పెద్దగ అవకాశాలు రావడం లేదు. దీంతో  వరుడి వేటలో ఉన్నట్లు చెప్పకనే చెబుతుంది. దానికి తోడు ఈ అమ్మడికి 27 వచ్చాయి కాబట్టి ఇప్పటి నుండి పెళ్లి కొడుకు వెతికే పనిలో ఉంటే కానీ తన ఇష్టానిక తగిన వరుడు దొరకడని డిసైడ్ అయ్యింది కాబోలు.   మరి మిల్కీ బ్యూటీ కి కాబోయే మొగుడు ఎక్కడున్నాడో ?


మరింత సమాచారం తెలుసుకోండి: