పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే హుశారెత్తే మ్యూజిక్ ఉండాల్సిందే. అలా దేవితో అదిరిపోయే ఆల్బం లను ఎన్నో అందుకున్న పవర్ స్టార్ ఈసారి కోలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ తో కూడా అంతే సాంగ్స్ వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాడట. దర్శకుడు త్రివిక్రం కాబట్టి సాంగ్స్ కచ్చితంగా బాగుంటాయని చెప్పొచ్చు.


అయితే పవన్ సినిమాల్లో ఓ ఆనవాయితి ఉంది. తను నటించే సినిమాల్లో సరదాగా ఓ పాట పాడటం పవన్ కు అలవాటే. అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడా సాంగ్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. అందుకే రాబోతున్న త్రివిక్రం సినిమాలో కూడా పవన్ మరోసారి తన గాత్రాన్ని సరి చేసుకుంటున్నాడట. అనిరుధ్ రవిచంద్రన్ ప్రోత్సాహంతో పవన్ మరోసారి ఈ ప్రయోగం చేస్తున్నాడట.  


కీర్తి సురేష్, అను ఎమాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ అత్తగా ఖుష్బు నటిస్తుండటం విశేషం. కాటమరాయుడు ఫ్లాప్ తర్వాత పవన్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలైతే తారాస్థాయిలో ఉన్నాయి.


ఈ సినిమా బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరుగుతుంది. కేవలం శాటిలైట్ రైట్సే జెమిని టివి 19.5 కోట్లకు కొనేశారని టాక్. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్ త్రివిక్రం కాంబోలో వస్తున్న ఈ సినిమా అంతే అంచనాలతో వస్తుంది. మరి అంచనాలకు మించి సినిమా సంచలనాలు సృష్టిస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: