బోయపాటి శ్రీను డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న సినిమా జయ జానకి నాయక. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. టైటిల్ లానే టీజర్ కూడా చాలా ప్లెసెంట్ గా ఉంది. ఎప్పుడు కత్తులు రక్తపాతాలతో సినిమా తీసే బోయపాటి కొత్త ఫ్లేవర్ తో ఈ సినిమా తీశాదని చెప్పొచ్చు.


అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే టీజర్ లో హీరోయిన్ ను చూస్తూ క్యాజువల్ గా కనిపించిన హీరో కచ్చితంగా అసలు కథ వేరే ఉంటుందని చెప్పొచ్చు. బోయపాటి మార్క్ టీజర్ లో కనిపించకపోయినా టీజర్ మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది. 


ద్వారకా క్రియేషన్స్ పతాకంలో మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్టు 11న రిలీజ్ కానుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోతాయని చెప్పొచ్చు. టైటిల్ సాంగ్ జయ జానకి నాయకా సాకి అయితే బాగా అనిపిస్తుంది. బోయపాటి టేకింగ్ లో బెల్లంకొండ బాబు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: