అచ్చం సినిమాల్లో మాదిరిగానే ఓ విలన్ కుట్ర చేస్తే ఎలా ఉంటుందో రియల్ లైఫ్ లో కూడా అలాంటి పన్నాగాలు..కుట్రలు పన్నాడని మళియాళ నటడు దిలీప్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు.  మళయాళ ప్రముఖ సినీ నటి భావన కిడ్నాప్ కేసులో ప్రముఖ నటుడు దిలీప్‌కుమార్ హస్తం ఉన్నట్లు గత కొంత కాలంగా అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. భావనపై లైంగిక వేధింపుల కేసులో దిలీప్ ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లభించడంతో కేరళ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు.
Related image
కాగా, ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన కారులో వెళ్తున్న నటి భావనను కొందరు అడ్డగించి ఆమె వాహనంలోకి ఎక్కారు.  సుమారు రెండు గంటలపాటు లైంగికంగా వేధించడమే కాకుండా, అశ్లీల ఫొటోలూ తీశారు. అప్పట్లో ఈ కిడ్నాపింగ్ వెనుక సినీ పెద్దల హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి.. ఈ నేపథ్యంలో నటుడు దిలీప్‌ను రెండువారాల కిందట పోలీసులు విచారించారు.
Image result for న‌టుడు దిలీప్ అరెస్ట్
చివరకు ఆయన ప్రమేయంపై ఆధారాలు లభించడంతో ఈ రోజు అరెస్ట్ చేశారు. అయితే రో అరెస్ట్‌ తో మలయాళీ చిత్ర పరిశ్రమకు రూ.60 కోట్ల నష్టం వచ్చింది. దీంతో అతనిని బయటకు తీసుకు రావడానికి  ప్రముఖ లాయర్ కె.రామ్ కుమార్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.  దిలీప్‌ నటిస్తున్న చాలా సినిమాలు చిత్రీకరణ దశలోనే ఉన్నాయి.
Related image
కొన్ని సినిమాలు  చిత్రీకరణ పూర్తయ్యే సమయానికి ఆయన అరెస్ట్‌ అవ్వడంతో కోట్లల్లో నష్టం వాటిల్లిందంటున్నారు మాలీవుడ్ సినీ ఇండస్ట్రీ. దిలీప్ అరెస్ట్ తో ఆయనతో సినిమాలు తీస్తున్న.. ఇప్పటికే పూర్తి చేసిన నిర్మాతలు ఆందోళనకు గురవుతున్నారు. దిలీప్‌ నటించిన ‘రాంలీలా’ చిత్రం జులై 21న విడుదల కావాల్సి ఉంది. అంతే కాదు దిలీప్‌ను మలయాళీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ నుంచి కూడా తప్పించారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: