సినిమా, రాజకీయల్లో కొంత మందికి సెంటిమెంట్ ని ఫాలో అయ్యే అలవాట్లు బాగా ఉన్నాయి.  కొంత మంది హీరోలు ఒక నెలలో తమ సినిమాలు రిలీజ్ అయితే తప్పకుండా హిట్ అవుతాయిన గట్టి నమ్మకం ఉంటుంది. కొంత మంది రాజకీయ నాయకులకు కొన్ని దేవస్థానాలు..కొన్ని ఊర్లలో పర్యటిస్తే తప్పకుండా సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందీ అన్న నమ్మకం ఉంటుంది.  ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడవ సినిమా వస్తుంది.
Image result for katama rayudu song making
 అయితే పవన్ కళ్యాన్ నాస్తికుడు అని చాలా మంది అంటారు కానీ..పవన్ కి ఉన్న సెంటిమెంట్స్..ఆయన ఫాలో అయ్యే సెంటిమెంట్స్ చూస్తే చాలా మంది షాక్ అవుతారు.  తాజాగా పవన్‌ కల్యాణ్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో రానుంది కొత్త సినిమాలో ఓ పాట పాడబోతున్నాడని సమాచారం.  గతంలో అత్తారింటికి దారేది చిత్రంలో ‘కాటమ రాయుడా’ అనే పాట పాడిన విషయం తెలిసిందే..ఆ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియెట్ చేసింది.  
Related image
దేవీ శ్రీ సంగీతానికి పవన్ పాడిన స్టైల్ అప్పట్లో యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది.  ఇప్పుడు ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు పవన్ కళ్యాన్. దీనికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ట్యూన్ రెడీ చేసినట్టు సమాచారం. ఈ లెక్కన అత్తారింటికి దారేది సెంటిమెంట్‌ని పవన్ ఫాలో అవుతున్నట్లు అభిమానులు చర్చించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: