నితిన్ హీరోగా హను రాఘవపుడి డైరక్షన్ లో వస్తున్న సినిమా లై. అఆ తర్వాత నితిన్.. కృష్ణగాడి వీర ప్రేమగాధ తర్వాత హను ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ నిన్న సాయంత్రం రిలీజ్ అయ్యింది. సినిమా మీద అంచనాలను పెంచేసిన టీజర్ గురించి టాలీవుడ్ లో ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలను పెంచేయగా.. ఇక ఇప్పుడు బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ కూడా లై టీజర్ ను పొగిడేస్తున్నాడు.


మీ కళ్లను.. మీ దృష్టిని రెండిటిని ఆకర్షించేది ఈ టీజర్ అంటూ లై టీజర్ గురిచి ప్రస్తావించారు తరుణ్ ఆదర్శ్. ఈమధ్య తెలుగు సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన బాలీవుడ్ సిని విమర్శకులు ఇక్కడ ట్రెండింగ్ గా ఉన్న విషయాల పట్ల ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను వెళ్లడిస్తున్నారు. ఇక రిలీజ్ అయిన లై టీజర్ నిజంగానే అదుర్స్ అని చెప్పొచ్చు.  


నితిన్ లో ఈ యాంగిల్ కచ్చితంగా ఎవరు ఊహించి ఉండరు. మాస్ గడ్డంతో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న నితిన్ ను చూస్తుంటే ఈ లై కచ్చితంగా ఓ రేంజ్ లో హిట్ కొట్టేలా కనిపిస్తుంది. ఇక సినిమాలో స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన విషయం అర్జున్ విలన్ గా చేస్తుండటమే. ఇన్నాళ్లు హీరోగా అదిరిపోయే హిట్లు అందుకున్న అర్జున్ తొలిసారి విలన్ గా నటిస్తున్నాడు.


మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ టీజర్ తోనే కేక పెట్టించేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే నితిన్ ఈ సినిమా తర్వాత తన రేంజ్ పెరిగిపోద్ది అన్నట్టుగా సినిమా టీజర్ ఉంది. ఆగష్టు 11న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా నితిన్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: