నాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇయర్ ఇప్పటికే నేను లోకల్ తో హిట్ అందుకున్న నాని రీసెంట్ గా వచ్చిన నిన్ను కోరితో కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఈ సినిమా నాని కలక్షన్స్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తుంది.  


నేను లోకల్ హిట్ తో తన రెమ్యునరేషన్ 5 కోట్ల దాకా పెంచేసిన నాని అదే రెమ్యునరేషన్ తో మూడు నాలుగు సినిమాలు సైన్ చేశాడు. ఇక కొత్తగా నిన్ను కోరి కూడా సూపర్ హిత్ అయ్యింది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లు మాత్రమే.. కచ్చితంగా 25 నుండి 30 కోట్ల దాకా వసూళు చేస్తుందని అంటున్నారు. కాబట్టి రెమ్యునరేషన్ మరో మూడు కోట్లు పెంచే ఆలోచనలో ఉన్నడట నాని.


నాచురల్ నటనతో ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేస్తున్న నాని మంచి కథలతో వరుస హిట్లు అందుకుంటున్నాడు. నిన్ను కోరి హిట్ తో నాని రేంజ్ మరింత పెరిగింది. ఇక 8 కోట్ల రెమ్యునరేషన్ అంటే స్టార్ హీరోగా నాని ఫిక్స్ అయిపోవచ్చు. ఇండస్ట్రీకి అసిస్టెంట్ దర్శకుడిగా పరిచయమైన నాని ఇప్పుడు స్టార్స్ సైతం అవాక్కయ్యేలా సినిమాలు తీసి హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. 


నిన్ను కోరి హిట్ జోష్ లో ఉన్న నాని ప్రస్తుతం వేణు శ్రీరాం డైరక్షన్ లో ఎం.సి.ఏ సినిమా చేస్తున్నాడు. ఇక అది పూర్తి కాకముందే మేర్ల పాక గాంధితో ఓ సినిమా. హను రాఘవపుడితో మరో సినిమా సైన్ చేశాడట. తక్కువ రోజుల్లోనే సినిమాలను పూర్తి చేసి ఇయర్ కు మూడు, నాలుగు సినిమాలు ఇవ్వాలన్న నాని ఆలోచనకు అందరు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: