గత కొంత కాలంగా విశ్వనటుడు కమల్ హాసన్ ఎన్నో వివాదాలు ఎదుర్కొంటున్నారు.  ఆ మద్య మహాభారతం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. తాజాగా  త‌మిళ బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న క‌మ‌ల్ త‌మిళ సంస్కృతికి, త‌మిళ నాడు విలువ‌ల‌కి వ్య‌తిరేఖంగా వెళుతున్నాడ‌ని హిందూ మక్కల్ కట్చి ఆరోపిస్తుంది.  ఈ మేరకు షో నిర్వాహకులు, కమల్‌హాసన్‌‌లపై చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్ షో ద్వారా ఎక్కువ‌గా బూతు చూపిస్తున్నార‌ని, వెంట‌నే ఈ కార్యక్ర‌మాన్ని ఆప‌క‌పోతే భౌతిక దౌడులు చేసేందుకు కూడా వెనుకాడ‌బోమ‌ని వారు ఆరోపిస్తున్నారు.
Image result for kamal haasan big boss
క‌మ‌ల్ గ‌తంలో ద్రౌప‌ది, మ‌హా భార‌తంపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికి దానిని సీరియ‌స్ గా తీసుకోలేదు. కాని ఈ షోని ఇలాగే కొన‌సాగిస్తే అస్స‌లు ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని మక్కల్ కట్చి వారు మండి ప‌డుతున్నారు.  తాజాగా దీనిపై స్పందించిన కమల్ బిగ్‌బాస్‌ ఓ సామాజిక కార్యక్రమమని, అందుకే ఓకే చేసేనట్టు చెప్పాడు.ఈ విషయంలో తనను అరెస్ట్‌ చేసినా ఫర్వాలేదన్నాడు.  
అంతే కాదు కోట్ల మంది అభిమానించే క్రీడ క్రికెట్ మరి ఆ క్రీడ ఆడేటప్పుడు చీర్‌లీడర్స్‌పై నిషేధం ఎందుకు విధించరని ప్రశ్నించాడు. హిందూగ్రూపులు తనను కమ్యూనిస్టుగా పేర్కొంటున్నాయని, నిజానికి తాను రేషనలిస్ట్‌ని, కొత్త  ఆలోచనలను, ఆవిష్కరణలను నేనెప్పుడూ స్వాగతిస్తానని అంటున్నాడు కమల్.

Related image


మరింత సమాచారం తెలుసుకోండి: