జబర్దస్త్ షోలో తన పంచ్ లతో బాగా ఫేమస్ అయిన ఆది కొద్ది కాలంగా ఓ సీరియల్ యాక్టర్ ను ప్రేమిస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. దీనిపై ఆది స్పందించలేదు కాని ఆది ఎవరినో ప్రేమిస్తున్నాడు అన్న విషయం మాత్రం అందరికి తెలుసు. తన చలాకి తనంతో ఎవరినైనా ఇంప్రెస్ చేసే ఆది సీరియల్ హీరోయిన్ ను ప్రేమించాడని టాక్.


ఇక కొద్ది కాలంగా ప్రేమాయణం సాగించిన ఆది ఎట్టకేలకు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. అది కూడా చాలా సీక్రెట్ గా ఈ పెళ్లి జరిగిందట. కేవలం కొంతమంది సన్నిహితుల మధ్యనే ఈ పెళ్లి జరిగిందట. కనీసం జబర్దస్త్ టీం మెట్స్ కు విషయం చెప్పలేదని తెలుస్తుంది. అయితే ఆది పెళ్లి చేసుకున్న అమ్మాయి నిజంగా సీరియల్ నటేనా కాదా అన్నది ఇంకా తెలియలేదు.


మొత్తానికి ఆది ఓ ఇంటి వాడయ్యాడు. పెళ్లి మీద కాపురం మీద సెటైర్స్ వేసి జబర్దస్త్ లో కామెడీ చేసే ఆది రియల్ లైఫ్ లో అసలైన ఘట్టాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈటివి జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయిన ఆది తన పంచ్ లతో ఆడియెన్స్ కు నవ్వులు పంచుతున్నాడు. ఇక పెళ్లి ఎలాగు ఎవరికి చెప్పకుండా చేసుకున్నాడు కాబట్టి రిసెప్షన్ కు అందరిని పిలవాలని చూస్తున్నాడట.


ఆది ఇలాంటి డేర్ స్టెప్ తీసుకున్నాడు అంటే దీనిలో కచ్చితంగా జబర్దస్త్ జడ్జులుగా ఉన్న నాగబాబు, రోజాల ప్రమేయం ఉండే ఉంటుందని అందరు అనుకుంటున్నారు. మరి ఆది పెళ్లి మ్యాటర్ కు సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. ప్రస్తుతం ఆది పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: