ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టార్ చిత్రాలు బాగానే వస్తున్నాయి.  ఆ మద్య వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మంచి హిట్ సాధించింది.  తర్వాత వెంకటేష్, పవన్ కళ్యాన్ నటించిన ‘గోపాల గోపాల’ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  అడపా దడపా చిన్న హీరోల కాంబినేషన్ లో సినిమాలు వస్తూనే ఉన్నాయి.  తాజాగా యంగ్ హీరోలు నలుగురు కలిసి ‘శమంతకమణి’  ఒకే సినిమాలో సందడి చేయడం సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.  
Image result for shamantakamani wiki
టీజర్, ట్రైలర్ లతో ఆసక్తిని రేకెత్తించిన శమంతకమణి చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  నలుగురు హీరోలు నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్ మరియు సుదీర్ బాబు లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కారు మిస్సింగ్ కథాంశంతో ఈ చిత్రం రాబోతోందని విషయం ట్రైలర్ ద్వారా అర్థమైంది. పోలీస్ ఆఫీసర్ గా నారా రోహిత్ యాక్షన్ పరంగా సూపర్ అనిపించాడట..అయితే మిగతా ముగ్గురు హీరోలు ఆది, సుదీర్ బాబు, సందీప్ కిషన్ తమ తమ పాత్రల్లో బాగానే ఒదిగిపోయారు.  
Image result for shamantakamani wiki
అంతే కాదు దర్శకులు ఆదిత్య శ్రీరామ్ నలుగురు హీరోలకు  సమానమైన ప్రాధాన్యత కల్పించినట్లు తెలుస్తుంది.  ఈ మద్య మల్టీ స్టారర్ చిత్రాలతో హీరోలు ఎలాంటి ఈగో ఫీలింగ్స్ లేకుండా నటిస్తున్నారు.   కారు మిస్సింగ్ నేపథ్యంలో దర్శకుడు రాసుకున్న ఇన్వెస్టిగేషన్ సీన్లు, అందులోనుంచి జెనెరేట్ చేసిన కామెడీ బావుంది.  ఫస్టాఫ్ మొత్తం సిరియస్ మోడ్ లో నడిచినా..సెకండ్ ఆఫ్ మాత్రం కామెడీ..రొమాన్స్ తో సినిమాకు కాస్త బలం చేకూర్చాయని అంటున్నారు. సెకండ్ ఆఫ్ లో కొన్ని ట్విస్ట్ లో సినిమాపై మంచి అంచనా పెంచారట.  
Image result
ఓవరాల్ గా ఈ చిత్రం పరవాలేదనిపిందని కొంత మంది ప్రేక్షకులు అంటున్నా..సినిమా పూర్తి రిజల్ట్ రేపటి వరకు తెలుస్తుంది..ఈ సినిమా ఏపాటి కలెక్షన్లు సాధిస్తుందో తెలియాలి.  ఈ రోజు శమంతకమణితో పాటు జగపతి బాబు నటించిన ‘పటేల్ సార్’ చిత్రం కూడా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ వస్తే కాంపిటీషన్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: