తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతిబాబు ‘లెజెండ్’ చిత్రం తర్వాత విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. తర్వాత విలన్, క్యారెక్టర్ పాత్రలతో తెలుగు, తమిళ, మళియాల భాషల్లో బిజీ నటుడిగా మారిపోయారు.  తన సహనటులంతా సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంట్రీ ఇవ్వడంతో వెరైటీగా జగపతిబాబు మాత్రం విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.  చాలా  కాలం తర్వాత జగపతి బాబు మళ్లీ హీరోగా చేసిన సినిమా   'పటేల్ సర్' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మొదటి నుంచి ఈ చిత్రంపై టీజర్, ట్రైలర్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
సెంటిమెంట్ వర్కౌట్ అయింది
 జగపతి బాబు లుక్, అందులో అతడి యాక్షన్ చూసిన చాలా మంది ఇందులో చాలా పవర్ ఫుల్ పాత్రతో కనిపించబోతున్నారని ఎక్స్ పెట్ చేశారు.  అందరి అంచనాలకు తగ్గట్టుగానే జగపతిబాబు ఈ సినిమాలో భలే ట్విస్ట్ ఇచ్చాడు.  ‘పటేల్ సార్’ చిత్రంలో జగపతిబాబు తండ్రి కోడుకుల పాత్రల్లో కనిపించాడు. సుభాష్ పటేల్ అలియాస్ పటేల్ సర్(జగపతి బాబు) రిటైర్డ్ ఆర్మీ మేజర్ తండ్రిపాత్రతో కనిపించగా డాక్టర్ పాత్రతో మరో పాత్రలో కనిపించాడు.  తండ్రి పాత్రలో, కొడుకు పాత్రలో వైవిధ్యంగా నటించి మెప్పించాడు.
Image result for patel sir new stills
ఎలాంటి హంగామాలకు పోకుండా తన వయసుకు తగిన నటనతో సూపర్బ్ అనిపించాడు.  డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న దేవరాజ్ (కబీర్ దుహన్ సింగ్) గ్యాంగ్‌లోని వారిని ఒక్కకొక్కడిని లేపేస్తుంటాడు పటేల్ సర్. అతడి చివరి టార్గెట్ దేవరాజ్. అసలు దేవరాజ్‌ గ్యాంగుకు, ఆర్మీ రిటైర్డ్ మేజర్ పటేల్‌‌కు ఉన్న శత్రుత్వం ఏంటీ అనేది  తెరపై చూస్తే అర్థం అవుతుంది.  
Image result for patel sir new stills
వల్లభ్ భార్య పాత్రలో పద్మప్రియ, స్నేహితుడి పాత్రలో సుబ్బరాజు తదితరులు ఓకే. పౌడర్ పాండు పాత్రలో పోసాని కృష్ణ మురళి కాస్త నవ్వించాడు. సినిమా మొత్తం పటేల్ సర్ తో జర్నీ చేసిన బేబీ డాలీ చాలా అద్భుతంగా నటించింది.  టెక్నికల్ అంశాల పరంగా చూస్తే శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ ఓకే. డిజె వసంత్  బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.  
Image result for patel sir new stills
సినిమాలో తండ్రి కొడుకుల మధ్య జరిగే సెంటిమెంటు సీన్లను ప్రేక్షకుడు సైతం ఫీలయ్యేలా మలచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.  ఓవరాల్ గా సినిమా మరీ అంత బోర్ కొట్టే విధంగా లేదని ప్రేక్షకులు అంటున్నప్పటికీ ఎంత వరకు సక్సెస్ సాధిస్తుందని రేపటి వరకు తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: