నాచురల్ స్టార్ నాని వరుస విజయాలను చూసి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ రిలీజ్ నిన్ను కోరితో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నాని. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు శ్రీరాం డైరక్షన్ లో ఎం.సి.ఏ సినిమా చేస్తున్న నాని ఆ తర్వాత మేర్ల పాక గాంధి డైరక్షన్ లో సినిమా సైన్ చేశాడు.


ఎక్స్ ప్రెస్ డైరక్టర్ గా పేరున్న మేర్లపాక గాంధి సినిమాలో నానికి జోడిగా మళ్లీ నివేథానే సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట్. నాని నటించిన జెంటిల్మన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నివేథా థామస్ ఆ ఒక్క సినిమాతోనే ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఇక సెకండ్ మూవీ కూడా నానితోనే నిన్ను కోరిలో నటించి మరింతగా ప్రేక్షకులకు దగ్గరైంది.


నాని నివేథా హిట్ కాంబినేషన్ అని ఫిక్స్ అయ్యారు టాలీవుడ్ మేకర్స్. అందుకే నాని పక్కన ఆమెకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారట. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ జై లవకుశ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నివేథా థామస్ మళ్లీ నానితో మేర్లపాక గాంధి మూవీలో నటించే అవకాశాలున్నాయట. ఎంత హిట్ పెయిర్ అయినా మళ్లీ అదే జోడి చూడాలంటే కాస్త ఇబ్బందే.  


ఈ విషయంలో నాని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా లేక ఎలాగు హిట్ పెయిర్ కాబట్టి నివేథా అని చెబుతున్న దర్శక నిర్మాతల చాయిస్ కు ఓకే చెబుతున్నాడో తెలియదు కాని నానితో నివేథా ముచ్చటగా మూడో సినిమాకు రంగం సిద్ధమవుతుంది. మరి ఈ సినిమాతో ఈ జంట ఎలా అలరిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: