స్టార్ హీరోలను పొగడటం క్యారక్టర్ ఆర్టిస్టుల పని అయితే అదే పొగడ్త రాంగ్ టైంలో అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు బన్ని పరిస్థితి చూస్తే అర్ధమవుతుంది. విలన్ టర్నెడ్ హీరో జగపతి బాబు మళ్లీ హీరోగా అవతారం ఎత్తి చేసిన సినిమా పటేల్ సర్. వాసు పరిమి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇష్టమైన హీరో ఎవరని జగపతి బాబుని అడుగగా అల్లు అర్జున్ అనేశాడు జగపతి బాబు.


ఒకప్పుడు ఇదే జగపతి బాబు మహేష్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ఇక తారక్ తో నాన్నకు ప్రేమతో చేసే టైంలో ఎన్.టి.ఆర్ ను ఆకాశానికెత్తేశాడు. ఇక ఇప్పుడేమో ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అలియాస్ బన్ని అంటున్నాడు. అయితే ఇప్పుడు అసలే మెగా ఫ్యాన్స్ మంటలో ఉంటే సడెన్ గా జగ్గు భాయ్ బన్నిని పొగడటం వారికి నచ్చట్లేదు.


మెగా హీరోల ప్రమేయం లేకుండానే బన్ని ఈ రేంజ్ కు వచ్చాడా అని అందరు అంటున్నారు. జగపతి బాబు ఇష్టమైన హీరో బన్ని అన్న కామెంట్స్ కు మెగా ఫ్యాన్స్ విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా డిజె ఈవెంట్ లలో దేనిలో మెగా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయని అల్లు అర్జున్ ఈ గొడవలకు కారణమయ్యాడు. 


ఇప్పుడు జగపతి బాబు కామెంట్స్ కు బన్నికి ఎలాంటి సంబధం లేకున్నా సరే బన్ని మీద మళ్లీ మెగా ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. చూస్తూ చూస్తూనే మెగా ఫ్యాన్స్ కు ఫ్యామిలీకి బన్ని ఇలా దూరమవుతాడని ఎవరు ఊహించి ఉండరు.



మరింత సమాచారం తెలుసుకోండి: