యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారి స్మాల్ స్క్రీన్ పై చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. దేశ వ్యాప్తంగా ఎన్నో సంచలనాలను సృష్టించిన ఈ షో మొదటిసారి తెలుగులో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని కాస్త టెన్షన్ పడుతున్నారు. హింది బిగ్ బాస్ ఎంత హిట్ అయ్యిందో అంత వివాదాల్లో చిక్కుకుంది. ఇక పక్కనే తమిళంలో రీసెంట్ గా స్టార్త్ అయిన ఈ షో కమల్ హాసన్ కూడా దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు.


కమల్ హాసన్ గురిచైతే ఏకంగా ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ కొన్ని తమిళ సంఘాలు గొడవ చేస్తున్నాయి. ఇక ఇంత హడావిడిలో కూడా జూలై 16న అంటే రేపు సాయంత్రం బిగ్ బాస్ మొదటి తెలుగు ఎపిసోడ్ స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతుంది. కచ్చితంగా అంచనాలైతే ఉన్నాయి. కాని ఈ షో తారక్ ఇమేజ్ కు ఎలాంటి నెగటివ్ ఫీడ్ బ్యాక్ ను తెస్తుంది అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు.


తారక్ సన్నిహితులు కూడా కొందరు రిస్క్ అవసరమా అని చెబుతున్నారట. ఒక్కసారి కమిట్ అయ్యాడు కాబట్టి రిస్క్ తీసుకోక తప్పదు. అయితే తెలుగులో కొన్ని విషయాల పట్ల స్వేచ్చ చాలా ఉంటుంది. మనవాళ్లు ఎక్కువగా నెగటివ్ కే ఎక్కువ ఇష్టపడతారని అంటున్నారు. సో ధైర్యంగా ఈ షో చేయొచ్చని కొందరు సలహా ఇస్తున్నారట.


తారక్ ఈ షో ఎలా యాండిల్ చేస్తాడు.. తెలుగు ఆడియెన్స్ కోసం ఈ షో కాన్సెప్ట్ ఏమైనా మార్చారా.. ప్రెస్ మీట్ లో చెప్పినట్టు తెలుగు ఆడియెన్స్ సెన్సిబిలిటీని బట్టే ఈ షో ఉండబోతుందా.. అసలు ఈ షోలో ఉండే సెలబ్రిటీస్ ఎవరు ఈ ప్రశ్నలన్నిటికి ఆన్సర్ కావాలంటే కేవలం 24 గంటలు ఆగితే సరిపోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: