తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో, హీరోయిన్లకు ఉన్నతమైన కెరీర్ అందించిన గొప్ప దర్శకులు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుపై బాలీవుడ్ భామ తాప్సీ చేసిన కామెంట్స్ గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.  ఒక దశలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దలు తాప్సీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఈ అమ్మడు ఈ గొడవకు పులిస్టాప్ పెట్టేందుకు రాఘవేంద్రరావుజీ.. సారీ, నన్ను క్షమించండి చెప్పేసింది.

            తాప్సీకి టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ ఇవ్వబోతుందా..!
 ఓ కామెడీ యూట్యూబ్ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో భాగంగా త‌నను వెండితెర‌కు ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావుపై తాప్సీ చేసిన కామెంట్ల‌పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.   వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీకి తాప్సీని ‘ఝుమ్మందినాథం’ చిత్రంతో పరిచయం చేసింది రాఘవేంద్ర రావు..అలాంటి వ్యక్తిపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఎవ్వరూ జీర్ణించుకోలేక పోయారు.

            తాప్సీకి టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ ఇవ్వబోతుందా..!
ఈ నేపథ్యంలో తాప్సీ మాట్లాడుతూ - `నాపై నేను జోకులు వేసుకుంటున్నా అనుకున్నాగానీ, అవి ఇంత గొడ‌వ‌కు దారితీస్తాయ‌నుకోలేదు. రాఘ‌వేంద్ర‌రావుగారు నాకు సినీ జీవితాన్ని ఇచ్చారు. ఆయ‌న గురించి నేను త‌ప్పుగా ఎలా మాట్లాడ‌తాను` అంది. `ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన మాట‌లు మ‌న‌స్ఫూర్తిగా చెప్పిన‌వి కావు.. వాటిని అర్థం చేసుకోలేక త‌ప్పుదోవ ప‌ట్టించారు.ఏదేమైనా క్షమించ‌మ‌ని అడుగుతున్నాను` అని ఆమె పోస్ట్ చేసింది.  

            తాప్సీకి టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ ఇవ్వబోతుందా..!
గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలపై బాలీవుడ్ భామ రాధికా ఆప్టే కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది.  తెలుగు ఇండస్ట్రీలో అంతా హీరోయిజానికి మాత్రమే ప్రాధాన్య ఇస్తారని..హీరోయిన్లను గ్లామర్ కోసం మాత్రమే తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపై అప్పట్లో రాధికా ఆప్టేపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: