తెలుగు బుల్లితెరపై ఇప్పుడు సినీ సెలబ్రెటీల హంగామా కొనసాగుతుంది.  ఇప్పటికే బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్ తో అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు.  ఇక బాలీవుడ్ లో అయితే ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రోగ్రామ్స్ రక్తి కట్టిస్తున్నారు.  అలాంటిదే..‘బిగ్ బాస్ ’ షో...బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్నారు.  ఇక కోలీవుడ్ లో విశ్వనటుడు కమల్ హాసన్ హోస్ట్ గా ఉన్నారు.  షాండిల్ వుడ్ లో కిచ్చ సుదీప్ (ఈగ ఫేమ్) హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Image result for big boss show
మొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై సందడి చేయబోతున్నాడు.  పాపులర్ ప్రోగ్రామ్ ‘బిగ్ బాస్’ షో కి తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించబోతున్న విషయం తెలిసందే. ఇప్పటికే పోస్టర్స్, ప్రోమోస్ తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు.  జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్' రియాల్టీ షో రేపటి నుంచి ప్రారంభంకానుంది.
Image result for big boss show
పూణేలో వేసిన భారీ సెట్టింగ్ లో ఈ షో జరుగుతోంది. మొత్తం 12 మంది సెలబ్రిటీలు 70 రోజుల పాటు ఒక బిగ్ హౌస్ లో గడపనున్నారు. మొత్తం 60 కెమెరాలు వీరిని గమనించనున్నాయి.  ఈ ప్రోగ్రామ్ ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులు చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.  
Image result for big boss show
అయితే ఈ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది..అసలు ఎలా మొదలు కాబోతుందీ అనేదానిపై చాలా క్యూరియాసిటీ నెలకొంది.  అయితే ఈ షో ఎన్టీఆర్ డాన్స్ పర్ఫామెన్స్ తో ప్రారంభమవుతుందనే టాక్ వినిపిస్తోంది. దీని కోసం ఎన్టీఆర్ డాన్స్ రిహార్సల్స్ కూడా చేశాడట.  

Image result for big boss show kamal


మరింత సమాచారం తెలుసుకోండి: