మెగాస్టార్ తనయుడైన మెగా పవర్ స్టార్ రాం చరణ్ మట్టి మనిషని అన్నారు క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్. రాం చరణ్ తో సుకుమార్ రన్స్థలం 1985 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ టైంలో చరణ్ గురించి బాగా తెలుసుకున్నాడు సుక్కు. గోల్డెన్ స్పూన్ లో పుట్టిన చరణ్ చాలా సాదాసీదా జీవతాన్ని గడుపుతుంటాడని అనారు సుకుమార్.


చిరంజీవి గారబ్బాయిలా డాబు లేకుండా చాలా సింపుల్ గా ఉంటాడని చరణ్ మీద ప్రశంసలు కురిపించాడు సుకుమార్. ఇక తన నిర్మాణంలో వచ్చిన సెకండ్ మూవీ దర్శకుడు ఆడియో రిలీజ్ కు చరణ్ అటెండ్ అవడం ఈ ఆడియోకి కొత్త కలర్ వచ్చిందని.. దర్శకుడు హరి ప్రసాద్ తనకు చాలా బాగా కావాల్సిన మనిషని. అసలు సినిమా అనుభవం లేకుండా కథ చెప్పేసరికి నువ్వే డైరక్షన్ చెయ్యమని చెప్పానని అన్నాడు సుకుమార్.


ఇక హీరో అశోక్ తన టాలెంట్ ప్రూవ్ చేసుకునే మంచి కథ దొరికిందని. ఈ సినిమాకు దేవిని వాడుకోవచ్చు కాని ఎందుకో వాడుకోవాలనిపించలేదు. కాని దర్శకుడు మ్యూజిక్ డైరక్టర్ సాయి కార్తిక్ కూడా సూపర్ మ్యూజిక్ అందించాడని అన్నారు సుకుమార్. డైరక్టర్ హరి ప్రసాద్ తను చేసిన కాలేజ్ లోనే ఫిజిక్స్ లెక్చరర్ గా చేశారని. తను జీవితంలో కాస్త కుంగిపోయిన సందర్భాల్లో తను ఎంతో సపోర్ట్ ఇచ్చాడని అన్నారు సుకుమార్.


ఆడియో రిలీజ్ తో పాటుగా ట్రైలర్ కూడా రిలీజ్ చేసిన రాం చరణ్ ట్రైలర్ టీం అందరికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఓ పక్క దర్శకుడిగా సినిమాలు చేస్తూ నిర్మాతగా కూడా సుకుమార్ పది మంది దర్శకులకు సపోర్ట్ చేయడం గొప్ప విషయమని కొనియాడారు రాం చరణ్.



మరింత సమాచారం తెలుసుకోండి: