హీరోగా తన శకం ముగిసిపోయింది అని అర్ధం చేసుకుని చాలా తెలివిగా విలన్ గా టర్న్ అయ్యాడు హీరో జగపతి బాబు. ఫామిలీ సినిమాలకీ అంతః పురం లాంటి సినిమాలకీ కామెడీ సినిమాలకీ పెట్టింది పేరు ఐన జగపతి బాబు హీరోగా ఎంత ఫేమస్ అయ్యాడో ఒక్క లెజెండ్ సినిమాతోనే అంతకంటే ఫేమస్ అయిపోయాడు.


ఆయన ఖాతాలో సూపర్ విలన్ గా హిట్ లు దాచుకుంటున్నాడు జగపతిబాబు. ఈమ‌ధ్య‌లో జ‌గ‌ప‌తిబాబుకి చాలాసార్లు హీరోగా ఛాన్సులొచ్చాయి. కానీ.. ఈ టైమ్ లో రిస్క్ తీసుకోవ‌డం ఇష్టం లేక‌.. ఆయా క‌థ‌ల్ని, ఆఫ‌ర్ల‌ని ప‌క్క‌న పెట్టాడు. అలాంటి జ‌గ‌ప‌తిబాబు ‘ప‌టేల్ సార్‌’ క‌థ‌ని ఓకే చేశాడంటే… క‌చ్చితంగా అందులో గొప్ప విష‌య‌మేదో ఉండే ఉంటుంద‌నుకొంటాం. దానికి తగ్గ‌ట్టు ”ఈ సినిమా హిట్ అని అంటే.. నిరాశ ప‌డ‌తా. ఎందుకంటే సూప‌ర్ హిట్ కావ‌ల్సిన సినిమా ఇది” అంటూ చాలా గొప్ప‌గా మాట్లాడాడు.


పటేల్ సర్ సినిమాకి ఎక్కడ లేని హైప్ ఏర్పడింది, తక్కువ బడ్జెట్ లో తీసిన ఈ చిత్రానికి జనాలు థియేటర్ లకి ఎగబడ్డారు కానీ రొటీన్ రివెంజ్ డ్రామా ని అటూ ఇటూ చేసి పడేసాడు డైరెక్టర్. కొన్ని కొన్ని సీన్ లు తప్ప ఎక్కడా పాజిటివ్ లు కనపడలేదు. ఈ సినిమాని జగపతిబాబు ఎందుకు ఎత్తుకున్నాడు అని ఫీల్ అయినవాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. విలన్ నుంచి మళ్ళీ ఇలా హీరోగా రావడం జగపతిబాబు చేసిన అతిపెద్ద తప్పు అని చెప్పచ్చు 

మరింత సమాచారం తెలుసుకోండి: