తెలుగు సినిమా జనాల జాతకాలు ఒక్కొక్కటీ బయట పెడుతున్న డ్రగ్ మాఫియా నాయకుడు కెల్విన్ ఇవాళ విచారణ లో మరిన్ని తెలుగు పేర్లు బయట పెట్టినట్టు తెలుస్తోంది. మొదటి జాబితా లో భాగంగా వచ్చిన పేర్లలోని అందరికీ పోలీసులు నోటీసులు పంపించారు. సిట్ కి ఇప్పుడు రెండవ జాబితా సిద్దం అయ్యింది. కెల్విన్ మరి కాసేపట్లో మూడవ జాబితా కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది.


నాలుగు ఐదు సంవత్సరాలు గా రాణిస్తున్న యంగ్ హీరోయిన్ ల పేర్లు కూడా బయటకి వస్తున్నాయి అని సమాచారం.  రాజకీయ నాయకుల పుత్ర రత్నాలు, హై ప్రొఫైల్ ప్రముఖులు, పేజ్ - 3 సెలబ్రిటీల పేర్లు వెల్లడైనట్టు సిట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, నేటితో కెల్విన్ పోలీసు కస్టడీ ముగియనుండగా, అతన్నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి వున్నందున కస్టడీ పొడిగింపును కోరుతూ రేపు సిట్ బృందం కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: