తాజాగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కోట శ్రీనివాసరావు తన ఫేమస్ తెలంగాణా యాస తో డైలాగులు చెప్పింది ఆకట్టుకున్నారు. "హైదరాబాద్ కి రైల్ గాడీలో పోయేటందుకు పైసలున్న ప్రతోడూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటోడే. ఆడిని ప్రజాస్వామ్యం అంటే ఏందిర బై అని అడిగినమనుకో, హైదరాబాద్ లో ఆడుండే హోటల్ పేరు చెబ్తడు.


గిసుమంటి దమాక్ లేనోళ్లందరూ నాతానకు వచ్చి, నాకు సీటీ గావాలే, నాకు సీటీ గావాలే అని సంపుకుతింటాండ్రు. నేనేం జెయ్యాలే?" అంటూ ఛానల్ ఇంటర్వ్యూ లో ముచ్చటించారు ఆయన. తనని మండలాదీసుడు సినిమా టైం లో బెజవాడ రైల్వే స్టేషన్ లో ఎన్టీఆర్ ఫాన్స్, టీడీపీ కార్యకర్తలు అందరూ కిందపడేసి కొట్టారు అనీ ఆ తర్వాత కాలం లో ఎన్టీఆర్ తనని క్షమించారు అనీ చెప్పుకొచ్చారు కోటా.


ఇప్పటికీ చాలా మంది ఎన్టీఆర్ ఫాన్స్ కి తాను అంటే గిట్టదు అన్నారు ఆయన 

మరింత సమాచారం తెలుసుకోండి: