అక్కినేని అఖిల్ కు తల్లి పాత్రలో నటించేందుకు ముందుకొచ్చింది హాట్ భామ టబు. తెలుగు సినిమాలతో తెరంగేట్రం చేసి బాలీవుడ్ లో తన సత్తా చాటింది. అక్కడ ఫేడవుట్ అయిన ఈ భామ ఇప్పుడు తెలుగులో మళ్లీ రానించాలని చూస్తుంది. ఈ క్రమంలో నాగార్జున తనయుడు అఖిల్ సినిమాలో అఖిల్ తల్లి పాత్రలో నటించేందుకు ఒప్పుకుంది.


ఒకప్పుడు హాట్ హాట్ అందాలతో ఆడియెన్స్ మతులు పోగొట్టిన టబు ఇప్పుడు తల్లి పాత్రలను చేసుకుంటూ వస్తుంది. 40 ఏళ్లు పైబడినా పెళ్లి చేసుకోని టబు సిల్వర్ స్క్రీన్ పై మాత్రం తల్లి పాత్రలతో అదరగొట్టేస్తుంది. ఇక విక్రం కుమార్ డైరక్షన్ లో అఖిల్ కు మదర్ గా నటిస్తున్న టబు ఆ పాత్ర చేయడం తన అదృష్టంగా భావిస్తున్నా అంటుంది టబు.


ఒకప్పుడు నాగార్జున ప్రేయసిగా సినిమాల్లో నటించి మెప్పించిన టబు ఇప్పుడు అదే నాగార్జున తనయుడికి తల్లి పాత్రలో నటించడం యాదృచ్చికమే అయినా కాంబినేషన్ మాత్రం కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని అంటున్నారు. ఇక ఇందులో మరో విశేషం ఏంటి అంటే సినిమాను నాగార్జున నిర్మిస్తుండటమే.


యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో తల్లి పాత్రకు ఎక్కువ స్కోప్ ఉండటంతో పాత్ర నచ్చే చేస్తున్నా అని చెబుతుంది టబు. ఇక నచ్చిన పాత్ర అయినా అది ఎంత తక్కువ నిడివి ఉన్నా ఆలోచించనని అంటుంది. తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ తల్లి పాత్రలో ఆడియెన్స్ ను  ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: