యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై సందడి మొద‌లుపెట్టాడు. పాపులర్ ప్రోగ్రామ్ ‘బిగ్ బాస్’ షో కి తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ప్రారంభ‌మైంది. ఈ షోకి ఎన్టీఆర్ ఎన‌ర్జీ ప్ల‌స్ పాయింట్ గా చెప్పుకోవ‌చ్చు. షోలో ముందుగా ఎన్టీఆర్ 'బిగ్‌బాస్‌' హౌస్ ను ప‌రిచ‌యం చేశాడు. ఆ హౌస్‌లో స్విమ్మింగ్‌ఫూల్, బెడ్‌రూమ్, వాష్ రూమ్, కిచెన్, బిగ్‌బాస్ సీక్రెట్ రూమ్ చూపించాడు.


ఆ త‌ర్వాత 14 మంది పార్టిసిపెంట్స్‌ను ఒక్కొక్క‌రిని పిలిచి 'బిగ్‌బాస్‌' హౌస్ లోకి పంపించాడు. వీరంతా 70 రోజుల పాటు అదే హౌస్‌లో ఉంటారు. ఎవ‌రి వ‌ద్ద ఫోన్‌కు, ఇంట‌ర్నెట్‌కు దూరంగా ఉంటారు. తొలి రోజు రెండు గంట‌ల పాటు ఈ షో పార్టిసిపెంట్స్ ప‌రిచ‌యానికే స‌రిపోయింది.


ఈ షో కండీష‌న్‌ల‌ను బిగ్‌బాస్ తెలిపాడు. ఎల్ల‌ప్పుడు మైక్ వాడాల‌ని తెలిపాడు. ఎవ‌రూ హింస‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని తెలిపాడు.


బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న‌ది వీరే! 
* అర్చన 
* శివబాలాజీ 
* ముమైత్‌ఖాన్‌ 
* తేజస్వీ మాధవి 
* ధనరాజ్‌ 
* ఆదర్శ్‌ 
* సంపూర్ణేష్‌బాబు 
* మధు ప్రియ 
* కల్పన 
* మహేష్‌ కత్తి 
* జ్యోతి 
* సమీర్‌ 
* హరి తేజ 
* కత్తి కార్తీక



మరింత సమాచారం తెలుసుకోండి: