టాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపణలు గురించి తెలిసిందే.. తీగ లాగితే డొంక అంతా కదిలినట్టు. బడా బడా బాబులు ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మొదటి దఫాలో ఓ పది మది పేర్లు బయట పెట్టగా ఇప్పుడు ఎక్సైజ్ వారు సెకండ్ లిస్టు కూడా నిందితుడు కెల్విన్ చెప్పిన ఆధారంగా బయట పెట్టనున్నారట.


ఈ లిస్ట్ లో టాలీవుడ్ పెద్ద తలకాయలు స్టార్ హీరోలు ఉన్నట్టు సమాచారం. నిర్మాతల తనయులు.. ఫైట్ మాస్టర్ ఈ లిస్టులో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈ లిస్ట్ బయటకు రాకముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. లిస్ట్ లో అసలు ఎవరెవరున్నారు అన్నది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసు వారు నోటీసులు అందుకున్న నటులు కూడా తమకు దీనికి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు.


అయితే సెకండ్ లిస్ట్ లో ఉన్న ఆ పెద్ద వాళ్లెవరు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్స్ పెడుతున్నారు. ఎవరి వారు వారికి తోచినట్టుగా పేర్లు మెన్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇలా జరుగుతుందని తెలిసే తమకు ఈ డ్రగ్స్ కు ఎలాంటి సంబంధం లేదని కొందరు ఎనౌన్స్ మెంట్ ఇచ్చేస్తున్నారు. అయినా సరే ప్రచారం మాత్రం ఆగట్లేదు.


ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఆ సెకండ్ లిస్ట్ లోని బడా బాబుల పేర్లు నిజామా కాదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయంలో ఇంకెన్ని బాగోతాలు బయట పడతాయో అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పైకి హుందాగా కనిపించే సిని జనాల అసలు గుట్టు ఇదా అని అందరు అవాక్కవుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: