మెగా హీరోల మధ్య జరుగుతున్న రభసకు కచ్చితంగా వారే కారణమని అంటున్నారు సిని జనాలు. ఫ్యాన్స్ కు ఏదో మెసేజ్ ఇద్దామని రాంగ్ డైరక్షన్ చేసేసరికి అసలకే మోసం వచ్చేసింది. క్రేజ్ పెరిగింది ఏదైనా చెప్పొచ్చు అనుకున్న హీరోలకు ఊహించని రేంజ్ లో షాక్ ఇస్తున్నారు. ఇక ఈ క్రమంలో మెగా హీరోలందరితో చరణ్ మాత్రం తన ప్రవర్తనతో అందరిని షాక్ అయ్యేలా చేస్తున్నాడు.


మైక్ దొరికితే వివాదం సృష్టిస్తున్న మెగా హీరోలతో పోల్చితే చరణ్ చాలా పద్ధతిగా మాట్లాడాడని చెప్పొచ్చు. దర్శకుడు ఆడియో రిలీజ్ కు వచ్చిన చరణ్ సినిమా విశేషాలను మాట్లాడుతూ తన ఫ్యామిలీ గురించి కూడా అందరు ఇంప్రెస్ అయ్యేలా మాట్లాడాడు. తను మాట్లాడుతున్నప్పుడే పవర్ స్టార్ పవర్ స్టార్ అని కేకలేస్తుంటే బాబాయ్ అంటూ పలకడమే కాదు తన ఫ్యామిలీ గురించి తను మనసులో ఎక్కువ ఉంటుంది మాటల్లో తక్కువ ఉంటుందని ఫ్యాన్స్ ను మెప్పించేశాడు.


ఓ పక్క అల్లు అర్జున్ ఏమో చిరు, పవన్ ప్రస్తావనే తేకుండా ఉంటుంటే.. చరణ్ మాత్రం మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ అని లేకుండా అందరిని కలుపుకుపోతున్నాడు. ఇది కచ్చితంగా చరణ్ కు కలిసివచ్చే అంశమే అని చెప్పొచ్చు. వివాదాస్పద వ్యాఖ్యలు అప్పుడు కిక్ ఇస్తాయేమో కాని ఫ్యాన్స్ ను తమకి దూరం చేసున్నాయన్న విషయం గమనించాలి.


అల్లు అర్జున్ మీద ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అందరు గుస్సాగా ఉన్నారు. ఈ గ్యాప్ ను దూరం చేసే ప్రయత్నాల్లో బన్ని కూడా ఉన్నాడని తెలుస్తుంది. ఏది ఏమైనా చరణ్ మాత్రం ఈ మధ్య చాలా మారిపోయాడు. ఫ్యాన్స్ ఆలోచనలకు తగ్గట్టుగా అందరిని అలరించే స్పీచ్ ఇస్తున్నాడు.  కచ్చితంగా చరణ్ ను చూసి మిగతా మెగా హీరోలు కూడా నేర్చుకోవాలని అంటున్నారు.    



మరింత సమాచారం తెలుసుకోండి: