తెలుగు టీవీ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సందడి షురూ అయ్యింది. అభిమానుల భారీ అంచనాల మధ్య ఎన్టీఆర్ బిగ్ బాస్ షో తొలి ఎపిసోడ్ ప్రారంభమైంది. అయితే ఈ షోలో ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తుండటంతో పాటు.. 14 మంది సెలబ్రిటీలు పోటీదారులుగా ఉండటంతో ఆ సెలబ్రిటీలు ఎవరన్నది నిన్నటి వరకు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూశారు తెలుగు ప్రేక్షకులు.   మొత్తానికి ఆ సమయం రానే వచ్చింది..ఒక్కోక్కరినీ బిగ్ బాస్ హౌజ్ లోకి పిలిచారు ఎన్టీఆర్.  

మొత్తం 14 మంది జాబితాతో కూడిన ఈ సెలబ్రిటీలలో శివబాలాజీ, ముమైత్ ఖాన్, ధన రాజ్, ఆదర్శ్, సంపూర్ణేష్ బాబు, అర్చన, మధుప్రియ, కల్పన, మహేష్ కత్తి, జ్యోతి, సమీర్, హరితేజ, కత్తి కార్తీక ఉన్నారు.  బిగ్ బాస్ లో కంటెస్టంట్ చేసేవారు ఎలా ఉంటారో ఊరించి ఊరించి..చివరకు  ఫెడవుట్ అయిన వాళ్ళు , ఏమాత్రం వీళ్ళని చూడటానికి ఇష్టపడని వాళ్ళు ఈ షోలో పాల్గొనడం విచిత్రం. ఒకరిద్దరు మినహా ఈ షోలో పాల్గొంటున్న వాళ్ళ పట్ల పాజిటివ్ రెస్పాన్స్ లేదు.  14 మంది సెల‌బ్రిటీలు….60 కెమెరాలు…70 రోజులు…ఒకే ఒక్క బిగ్గు హౌజు… తో రాబోతున్న‌ది బిగ్ బాస్ తెలుగు షో.

జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ‌స్తున్న ఈ షో పై తెలుగు ప్రేక్ష‌కుల్లో భారీగానే అంచనాలు పెరిగాయి..కానీ నిన్న జరిగిన కార్యక్రమం చూసి చాలా మంది నీరుగారిపోయారని వార్తలు వస్తున్నాయి. ఆ మద్య  జరిగిన ప్రెస్ మీట్ లో మీడియా నుండి ఈ ప్రశ్న ఎదురుకాగా, ఎన్టీఆర్ అయితే తనకు తెలియదని, షో నిర్వాహకులు మాత్రం మొదటి షో వరకు వేచిచూడమని చెప్పారు.
Image result for big boss show telugu
 అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా ఈ జాబితా చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. తమ అభిమాన నాయకుడు చేస్తున్న షో లో సెలబ్రిటిలుగా కాస్తా మంచి స్థాయి ఉన్న హీరోలు, హీరోయిన్లు వస్తారనుకుంటే ఇదేంటీ చాన్సులే లేని చిన్న అర్టీస్టుల తో బిగ్ బాస్ హౌస్ నింపుతున్నారు అంటూ మండిపడుతున్నారు.  అంతే కాదు ఇది ఎన్టీఆర్ హోస్ట్ చేయదగ్గది కాదని నెటిజన్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: