ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కాస్త పెద్ద హీరోలు అయితే భారీ బడ్జెట్ తో సినిమా కంప్లీట్ చేస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ అయి సక్సెస్ సాధిస్తే పెట్టిన పెట్టుబడి వస్తుంది..ఒక్కసారి ఫ్లాప్ టాక్ వచ్చిందంటే కలెక్షన్లపై పెద్ద ఎత్తున్న ప్రభావం ఉంటుంది.  ఇక బాలీవుడ్ లో ఎంతో పేరున్న కపూర్ కుటుంబం నుంచి వచ్చిన హీరో బాలీవుడ్ అందగాడు రణబీర్ కపూర్.  మనోడికి గత కొంత కాలంగా ఏ ఒక్క సినిమా కలిసి రావడం లేదు.  తాజాగా ఈ హీరో తన మాజీ ప్రియురాలు కత్తిలాంటి కత్రినా కైఫ్ తో కలిసి నటించిన చిత్రం '' జగ్గా జాసూస్ ''. సినిమా రిలీజ్ అయి మూడు రోజులు కావొస్తున్నా..కలెన్లు 20 కోట్లు మాత్రమే వచ్చాయి.
Image result for jagga jasoos movies
దీంతో ఢీలా పడ్డ చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ మరింత చేయాలని చూస్తున్నారట.  రెండు రోజుల్లో కేవలం 20 కోట్లు మాత్రమే వసూల్ చేసినా ఆదివారం కాస్త కలెక్షన్లు ఎక్కువ వస్తాయని భావించారట..మరి  వన్ వీక్ కలెక్షన్ల వరకు సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుందో అని టెన్షన్లో పడ్డారు బయ్యర్లు. కాకపోతే సినిమా కు లాభాలు రాకుండా బయ్యర్లు ఎవరైనా నష్టపోతే ఆ డబ్బు తిరిగి ఇస్తానని మాట ఇచ్చాడు.
Image result for jagga jasoos movies
రణబీర్ కపూర్ దాంతో బయ్యర్లు కొంత సంతోషంగానే ఉన్నారు.  ఇక పెట్టిన పెట్టుబడి ఈ సినిమా ద్వారా వస్తే ఓకే లేదంటే ఎలాగూ రణబీర్ ఉండనే ఉన్నాడు కదా అన్న ధీమాలో బయ్యర్లు ఉన్నారట. మరి సినిమా సక్సెస్ బాటలో నడిచి పెట్టిన పెట్టుబడి వస్తే రణబీర్ గట్టెక్కుతాడు..లేదంటా పాపం మనోడి పరిస్థితి అంతే. 


మరింత సమాచారం తెలుసుకోండి: